Top-6 News of the Day: రవితేజకు శస్త్రచికిత్సతో ఆరు వారాల విశ్రాంతి: మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day
x

Top-6 News of the Day

Highlights

1.రవితేజ కుడిచేయికి గాయం, శస్త్రచికిత్సటాలీవుడ్ నటులు రవితేజకు శస్త్రచికిత్స జరిగింది. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సినిమా...

1.రవితేజ కుడిచేయికి గాయం, శస్త్రచికిత్స

టాలీవుడ్ నటులు రవితేజకు శస్త్రచికిత్స జరిగింది. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సినిమా షూటింగ్ లో ఆయన కుడి చేతికి స్వల్ప గాయమైంది. షూటింగ్ పూర్తైన తర్వాత వైద్యుల సూచన మేరకు ఆయన శస్త్రచికిత్స చేసుకున్నారు. ఇటీవలనే ఆయన నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలైంది.

2. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది మే లో జరిగిన ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు పోలీసులపై దాడి కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి వారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట సంతకం పెట్టాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

3. నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో కుర్చీలోనే గర్భిణి ప్రసవం

నల్గొండ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గర్భిణి కుర్చీలోనే ప్రసవించింది. నేరేడుగొమ్మ మండలానికి చెందిన నల్లవెల్లి ఆశ్విని తన భర్తతో కలిసి ఈ నెల 22 రాత్రి నల్గొండ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అయితే ఆమెకు బెడ్ తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించలేదు. దీంతో కుర్చీలోనే కూర్చుంది. అదే సమయంలో పురిటినొప్పులు వచ్చి మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గమనించి వెంటనే ఆమెను వార్డుకు తరలించారు ఆసుపత్రి సిబ్బంది. ఈ ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఆరా తీస్తున్నారు.

4. ఇండియాపై అణుబాంబ్ వేస్తానన్న బ్రిటన్ యూట్యూబర్

భారత్ పై న్యూక్లియర్ బాంబు వేస్తానని బ్రిటిష్ యూట్యూబర్ మైల్స్ రౌట్లెడ్జ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాను బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైతే ఇండియాపై అణుబాంబు వేస్తానని ఆయన అన్నారు. గతంలో ఆఫ్గానిస్తాన్ కు వెళ్లి అక్కడే అతను చిక్కుకుపోతే ఆయనను బ్రిటన్ ఆర్మీ అక్కడి నుంచి సురక్షితంగా తరలించింది.

5. ఆర్ జీ కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై అవినీతి ఆరోపణలు.. విచారణ సీబీఐకి అప్పగింత

ఆర్ జీ కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను సీబీఐకి అప్పగించాలని కోల్ కతా హైకోర్టు సిట్ ను ఆదేశించింది. ఈ ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆగస్టు 24 ఉదయం 10 గంటలలోపుగా సీబీఐకి అందించాలని హైకోర్టు ఆదేశించింది.

6. ఖర్గే, రాహుల్ తో రేవంత్ రెడ్డి భేటీ: మంత్రివర్గ విస్తరణ, నామినేట్ పోస్టుల భర్తీపై చర్చ

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు శనివారం సమావేశమయ్యారు. నామినేటేడ్ పోస్టుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. పీసీసీ అధ్యక్ష పదవికి మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందనే ప్రచారం సాగుతోంది. రెండు మూడు రోజుల్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో చోటు కోసం పలువురు ఆశావహులు కూడా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories