Top-6 News of the Day: రుణమాఫీ మూడో విడతలో రూ. 18 వేల కోట్లు రిలీజ్ చేసిన రేవంత్: మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day(15/08/2024)
x

Top-6 News of the Day(15/08/2024)

Highlights

1. మూడో విడత పంట రుణమాఫీకి రూ.18వేల కోట్ల నిధుల విడుదల మూడో విడతలో రూ. 2 లక్షలవరకు పంట రుణ మాఫీకి అవసరమైన నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి...

1. మూడో విడత పంట రుణమాఫీకి రూ.18వేల కోట్ల నిధుల విడుదల


మూడో విడతలో రూ. 2 లక్షలవరకు పంట రుణ మాఫీకి అవసరమైన నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం విడుదల చేశారు. ఎన్నికల సమయంలో రూ. 2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఇప్పటికే రెండు విడుతలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరాలో నిర్వహించిన సభలో మూడోవిడత పంటరుణమాఫీ కింద రూ. 18వేల కోట్ల నిధులను విడుదల చేశారు. మూడు విడతల్లో రూ. 31 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.

2. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ


తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబసభ్యులు గురువారం దర్శించుకున్నారు. బుధవారం రాత్రి మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోధ్కర్ పిల్లలతో కలిసి అలిపిరి మార్గం నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపం వద్ద వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

3. సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ను ప్రారంభించిన రేవంత్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 3.29 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపాదించిన రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల డిజైన్లలో మార్పులు చేసి సీతారామ ప్రాజెక్టును రూపొందించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.

4. అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ఎన్ డీ ఏ ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. గుడివాడలో అన్న క్యాంటీన్ చంద్రబాబు దంపతులు పున:ప్రారంభించారు. 2014-2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ క్యాంటీన్లను మూసివేసింది. 2024లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. అన్న క్యాంటీన్ లో అల్పాహరంతో పాటు భోజనానికి కూడా రూ. 5 వసూలు చార్జీ చేస్తారు. ఆదివారం మాత్రం అన్న క్యాంటీన్ పనిచేయదు. ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తారు.

5. త్వరలోనే స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీకి బై పోల్: కేటీఆర్


త్వరలోనే రాష్ట్రంలోని స్టేషన్ ఘన్ పూర్, ఖైరతాబాద్, భద్రాచలం అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.గురువారం హైద్రాబాద్ లోని తెలంగాణ భవన్ లో స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ గులాబీ కండువా కప్పి ఆయన వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో బీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వంలో, పార్టీలో కీలక పదవులు అనుభవించిన నాయకులు పార్టీని వీడారని చెప్పారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై కోర్టులో కేసు నడుస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ముగ్గురిపై అనర్హత వేటు పడుతుందన్నారు. ఈ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని ఆయన చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కవితకు బెయిల్ విషయమై మాట్లాడేందుకు దిల్లీకి వెళ్తే బీజేపీలో విలీనం కోసం వెళ్లినట్టుగా తప్పుడు ప్రచారం చేశారన్నారు. బీజేపీతో ఒప్పందం చేసుకొంటే కవిత 150 రోజులుగా జైల్లో ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

6. థాయ్ లాండ్ ప్రధానిని తొలగించిన కోర్టు


నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలతో థాయ్ లాండ్ ప్రధానమంత్రి స్రెట్టా థావిసిస్ ను పదవి నుంచి తొలగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కొత్త ప్రధాని నియామకం వరకు అపద్దర్మ ప్రధానిగా స్రెట్టా కొనసాగుతారు. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత కొత్త ప్రధాని నియమిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories