Top-6 News of the Day: శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య ఎంగేజ్ మెంట్: మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day: శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య ఎంగేజ్ మెంట్: మరో 5 ముఖ్యాంశాలు
x

Top-6 News of the Day(08/08/2024)

Highlights

1. శోభిత దూళిపాళ్ల తో నాగచైతన్య ఎంగేజ్ మెంట్ నాగచైతన్య, నటి శోభిత దూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ గురువారం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను హీరో...

1. శోభిత దూళిపాళ్ల తో నాగచైతన్య ఎంగేజ్ మెంట్


నాగచైతన్య, నటి శోభిత దూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ గురువారం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇవాళ ఉదయం 9గంటల42 నిమిషాలకు నాగచైతన్య, శోభితా ల నిశ్చితార్ధం జరిగిందన్నారు. శోభితను తమ కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నట్టుగా నాగార్జున ప్రకటించారు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. రెండు కుటుంబాలకు చెందిన అతికొద్దిమంది అతిథుల సమక్షంలో నాగార్జున ఇంట్లో ఈ వేడుక జరిగింది. వీరిద్దరి వివాహం త్వరలోనే జరగనుంది. సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్నారు.

2. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత


బుద్దదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. 2000-2011 వరకు బెంగాల్ కు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. జ్యోతిబసు నుంచి ముఖ్యమంత్రి పదవిని బద్దదేవ్ 2000లో చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు జ్యోతిబసు మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. సీఎంగా ఉన్నసమయంలో బాలీగంజ్ లోని చిన్న నివాసంలోనే ఆయన నివసించారు. అక్కడి నుంచే ఆయన విధులు నిర్వహించారు.

3. జపాన్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక


జపాన్ లోని క్యుషు ద్వీపం సమీపంలో గురువారం భారీ భూకంపం సంభవించింది. రెండుసార్లు భూమి కంపించింది. తొలిసారి 6.9 తీవ్రతతో, రెండోసారి 7.1 గా తీవ్రతతో భూమి కంపించిందని అధికారులు చెప్పారు. ఈ భూకంపంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. క్యుషు, షికోకులోని పసిఫిక్ తీరంలో సముద్రమట్టం ఒక మీటరు మేర పెరిగే ప్రమాదం ఉందని భూగర్బశాస్త్రవేత్తలు వార్నింగ్ ఇచ్చారు. క్యుషు తూర్పు తీరంలో సుమారు 30 కి.మీ. లోతులో భూకంపకేంద్రం ఉందని అధికారులు గుర్తించారు.

4. కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ


పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో గురువారం నాడు సమావేశమయ్యారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ ఏనుగులను అదుపులో పెట్టేందుకు కుంకీ ఏనుగుల అవసరం ఉంది. ఈ విషయమై సీఎం సిద్దరామయ్య, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖండ్రేతో పవన్ కళ్యాణ్ చర్చించారు. దీంతో పాటుగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డుకట్టవేసేందుకు వీలుగా రెండు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసేలా కార్యాచరణను రూపొందించనున్నారు. ఈ విషయమై కూడా చర్చించారు.

5. తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ లకు డీజీగా పదోన్నతి


తెలంగాణలో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇంటలిజెన్స్ అదనపు డీజీ శివధర్ రెడ్డి, హైద్రాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, అభిలాష బిస్తీకి డీజీలుగా పదోన్నతి దక్కింది.

6. హీరో రాజ్ తరుణ్ కు ముందస్తు బెయిల్


రాజ్ తరుణ్ కు తెలంగాణ హైకోర్టు గురువారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశారని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ రాజ్ తరుణ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరో అమ్మాయి మోజులో పడి రాజ్ తరుణ్ తనను మోసం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories