Top 6 News Of The Day: మూసీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత: మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News Of The Day(01/10/2024)
x

Top 6 News Of The Day(01/10/2024)

Highlights

1. మూసీ రివర్ బెడ్ లో ఇళ్ల కూల్చివేత: నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లుహైద్రాబాద్ మలక్ పేట పరిధిలోని శంకర్ నగర్ లోని మూసీ రివర్ బెడ్ లోని ఇళ్ల...

1. మూసీ రివర్ బెడ్ లో ఇళ్ల కూల్చివేత: నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

హైద్రాబాద్ మలక్ పేట పరిధిలోని శంకర్ నగర్ లోని మూసీ రివర్ బెడ్ లోని ఇళ్ల కూల్చివేతలను మంగళవారం అధికారులు చేపట్టారు. ఇక్కడ స్వచ్ఛంధంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తరలించారు. మూసీ సుందరీకరణలో భాగంగా రివర్ బెడ్ లో ఉన్న అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఆయా ఇళ్లకు మార్కింగ్ కూడా చేశారు.

2. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యిపై సిట్ దర్యాప్తు నిలిపివేత: ఏపీ డీజీపీ

తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్న విషయమై వాస్తవాలను తెల్చేందుకు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును నిలిపివేసినట్టు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డూ వివాదంపై ఏర్పాటు దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 30న విచారణ జరిగింది. సిట్ విచారణను అక్టోబర్ 3 వరకు నిలిపివేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానాల ఆదేశం మేరకు సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఆయన తెలిపారు.

3. రజనీకాంత్ కు రక్తనాళ్లాల్లో ఇబ్బందులు: హెల్త్ బులెటిన్

ప్రముఖ సూపర్ స్టార్ రజనీకాంత్ కు రక్తనాళాల్లో ఇబ్బందులున్నాయని వైద్యులు ప్రకటించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలిపే హెల్త్ బులెటిన్ ను వైద్యులు మంగళవారం సాయంత్రం ఈ ఈ బులెటిన్ ను విడుదల చేశారు. గుండెకు సంబంధించిన సమస్యలపై చికిత్స చేసినట్టు వైద్యులు చెప్పారు. గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో వాపు ఉందని నాన్ సర్జికల్ ట్రాన్స్ క్యాతటర్ విధానంలో చికిత్స చేశామని అపోలో వైద్యులు తెలిపారు. స్టంట్ కూడా వేసినట్టుగా వైద్యులు ప్రకటించారు. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. రెండు రోజుల్లో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వివరించారు.తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న రజనీకాంత్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.

4. హైద్రాబాద్ లో డీజేపై నిషేధం

ఊరేగింపులు, వేడుకల సమయంలో శబ్ద కాలుష్యానికి దారి తీస్తున్న డీజేలపై నిషేధం విధిస్తున్నామని హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజేల విషయంలో డయల్ 100 కు ఫిర్యాదులు రావడంతో నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. డీజేలపై హైద్రాబాద్ పోలీసులు పలు రాజకీయపార్టీలు, మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ పోలీసు ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు.

5. కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి అలిపిరి నుంచి కాలినడకన ఆయన తిరుమలకు బయలుదేరారు. అక్టోబర్ 2న తిరుమలలో ఆయన ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. తిరుపతి లడ్డూ వివాదం విషయం వెలుగు చూసిన తర్వాత ఆయన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను ప్రారంభించారు. లడ్డూ వివాదం కేవలం ట్రిగ్గర్ మాత్రమేనని ఆయన చెప్పారు.కొన్ళ్లుగా 219 దేవాలయాలను ధ్వంసం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

6. బ్యాంకాక్ లో బస్సు ప్రమాదంలో 25 మంది విద్యార్ధుల సజీవ దహనం

బ్యాంకాక్ సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి తిరిగివస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో 44 మంది ఉన్నారు. మొత్తం 44 మందిలో 38 మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లున్నారు. ఇప్పటి వరకు 16 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లను రక్షించారు. బస్సులో ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories