Top-6 News of the Day: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా: మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా: మరో 5 ముఖ్యాంశాలు
x

Top-6 News of the Day(01/08/2024)

Highlights

Top-6 News of the Day(01/08/2024)1. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ : ఫలించిన ఎంఆర్ పీఎస్ పోరాటంఎస్సీ, ఎస్టీ...

Top-6 News of the Day(01/08/2024)

1. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ : ఫలించిన ఎంఆర్ పీఎస్ పోరాటం

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు గురువారం పచ్చజెండా ఊపింది. విద్యాసంస్థల్లో ఆడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రాష్ట్రాలు ఉప వర్గీకరించుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2004లో వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎస్సీ సామాజిక వర్గంలోని ఉప కులాలకు జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్లను కల్పించాలని కోరుతూ ఎంఆర్ పీ ఎస్ 1994లో ఉద్యమాన్ని ప్రారంభించింది. 30 ఏళ్ల తమ పోరాటానికి న్యాయం జరిగిందని ఎంఆర్ పీ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చెప్పారు. సుప్రీం తీర్పును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రస్తుతం చేపట్టే ఉద్యోగ నియామాకాల్లో కూడా రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఉమ్మడి ఏపీలో ఏబీసీడీ వర్గీకరణను అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


2. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి మంత్రి జూపల్లి బుజ్జగింపులు

జూపల్లి కృష్ణారావు గురువారం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో గద్వాలలో భేటీ అయ్యారు. ఆయన ఇంట్లోనే ఎమ్మెల్యేతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. బీఆర్ఎస్ లో చేరినట్టుగా కృష్ణమోహన్ రెడ్డిపై మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. అసెంబ్లీ లాబీల్లో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడితే తప్పేం ఉందని ప్రశ్నించారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటారని ఆయన చెప్పారు. స్థానికంగా పార్టీ నాయకుల మధ్య నెలకొన్న ఇబ్బందులతోనే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ వైపు వెళ్లారనే ప్రచారం ఉంది. ఈ నెల 7న కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అయితే రెండు రోజుల క్రితం ఆయన తిరిగి బీఆర్ఎస్ లో చేరినట్టుగా చెప్పారు. దీంతో కృష్ణమోహన్ రెడ్డితో కృష్ణారావు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


3. సత్యసాయి జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేసిన చంద్రబాబు

చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో పెన్షన్ల పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ డబ్బులు అందించారు.లబ్దిదారులతో ఆయన మాట్లాడారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తిరిగి ప్రజల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. పట్టు రైతులను ఆదుకోవాలని రంగనాథ్ సీఎంను కోరారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆయన చెప్పారు.


4. వయనాడ్ లో పర్యటించిన రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు గురువారం కేరళలోని వయనాడ్ లో పర్యటించారు. కొండచరియలు విరిగినపడిన ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో అందుతున్న సహాయం గురించి తెలుసుకున్నారు. బాధితులను ఆయన ఓదార్చారు. ఈ ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఆ మేరకు సాయం అందించాలని ఆయన కోరారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటికే 200 మందికి పైగా మరణించినట్టుగా స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.


5. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్

బీఆర్ఎస్ కు చెందిన మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల అవమానకరంగా మాట్లాడినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. నల్లబ్యాడ్జీలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కూడా ఈ డిమాండ్ పై సభలో నినాదాలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలోని సీఎం చాంబర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.


6. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో కాంస్యం

స్వప్నిల్ పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటారు. షూటింగ్ లో ఫైనల్ లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన లి యుకున్ స్వర్ణం గెలుచుకున్నారు. ఉక్రెయిన్ కులిష్ సెర్హియ్ రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నారు. భారత్ కు మరో పతకాన్ని సాధించిన స్వప్నిల్ ను మోదీ అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories