Top-6 News of the Day: పంటరుణమాఫీ తొలి విడత నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్: మరో 5 ముఖ్యాంశాలు

Top 6 News of the Day 18th July 2024
x

Top-6 News of the Day: పంటరుణమాఫీ తొలి విడత నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్: మరో 5 ముఖ్యాంశాలు

Highlights

Top-6 News of the Day (18/07/2024) పంట రుణమాఫీ తొలి విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Top-6 News of the Day (18/07/2024)

పంట రుణమాఫీ తొలి విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

1.రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురువారం పంట రుణమాఫీ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో రూ. 2లక్షల రైతుల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీలో భాగంగా తొలి విడతలో రూ.లక్ష రూపాయాల రుణమాఫీకి సంబంధించి 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.6,900 కోట్లను నిధులను జూలై 18న జమ చేశారు. జూలై నెలాఖరులోపుగా లక్షన్నర రుణం తీసుకున్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేస్తారు. ఆగస్టు మొదటి వారంలో రెండు లక్షలను మాఫీ చేయనున్నారు. మూడు విడతల్లో రూ. 31 వేల కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేయనుంది.


2. పుంగనూరులో టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య రాళ్ల దాడి: ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైఎస్ఆర్సీపీ, ఎన్ డీ ఏ కార్యకర్తల మధ్య గురువారం రాళ్ల దాడి జరిగింది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో వైసీపీ, కూటమి పార్టీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మరో వైపు ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు పుంగనూరు నుండి పంపారు.


3. చిన్నారులపై వీధికుక్కల దాడిపై హైకోర్టు ఆగ్రహం

చిన్నారులపై వీధికుక్కలపై దాడులపై తెలంగాణ హైకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఈ ఘటనలను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసింది. కుక్కలు పిల్లలపై దాడిచేయకుండా నివారించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని హైకోర్టు ఆదేశించింది. వీధికుక్కల దాడిలో చిన్నారి విశాల్ మృతి ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారిస్తుంది. జవహర్ నగర్ లో రెండు రోజుల క్రితం 18 నెలల చిన్నారి వీధికుక్కల దాడిలో మరణించారు.


ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ తల్లి అరెస్ట్

4. ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. భూ వివాదంలో పుణెలోని ముల్షి తహసీల్ పరిధిలోని ధద్వాలిలో ఓ రైతును మనోరమ బెదిరించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఆధారంగా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఆమెను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు.


5. పరీక్షా కేంద్రాల వారీగా నీట్-యూజీ పరీక్ష ఫలితాలు విడుదల చేయాలి

నీట్-యూజీ పరీక్ష ఫలితాలను ఈ నెల 20వ తేదీ 12 గంటలలోపుగా పరీక్ష కేంద్రం, నగరాల వారీగా ఫలితాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు ఎన్ టీ ఏను ఆదేశించింది. నీట్ -యూజీ పరీక్ష పేపర్ లీకైందని ఈ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతుంది. ఈ పిటిషన్లపై విచారణను ఈ నెల 22న తిరిగి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.


6. ఏలూరు వేలేరుపాడులో వాగులో కొట్టుకుపోయిన కారు: ఐదుగురు సురక్షితం

ఏలూరు జిల్లా వేలేరుపాడులో ఓ వాగులో కారు కొట్టుకుపోయింది. ఆ సమయంలో కారులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురున్నారు. కారు వాగులో కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తించిన స్థానికులు . కారులో ఉన్న రామారావు, జ్యోతి, గడ్డం కుందనకుమార్, సాయిజ్యోతి, గడ్డం జగదీశ్ కుమార్ లను స్థానికులు కాపాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories