CPCB Orders on Ganesh Nimajjanam: చార్జీలు వసూలు చేయండి.. వినాయక నిమజ్జనంపై సీపీసీబీ ఉత్తర్వులు

CPCB Orders on Ganesh Nimajjanam: చార్జీలు వసూలు చేయండి.. వినాయక నిమజ్జనంపై సీపీసీబీ ఉత్తర్వులు
x
Ganesh Festival
Highlights

CPCB Orders on Ganesh Nimajjanam: వినాయక చవితి వస్తుందంటే చాలు ... ఏ వీధిలో చూసినా పందిళ్లే..

CPCB Orders on Ganesh Nimajjanam: వినాయక చవితి వస్తుందంటే చాలు ... ఏ వీధిలో చూసినా పందిళ్లే.. వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసి, మరుసటి రోజు నుంచి పది, పదిహేను రోజుల పాటు నిమజ్జనం చేస్తూనే ఉంటారు. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఆయా రాష్ట్రాలు ప్రతిమలు ఏర్పాటు చేయడంలో పలు నిబంధనలు విధించగా, తాజాగా కేంద్ర కాలుష్య మండలి ప్రతిమలకు వాడే మెటీరియల్, నిమజ్జనంపై పలు ఆదేశాలు జారీ చేశాయి. వీటిని రాష్ట్రాలు తప్పకుండా అమలు చే యాలని ఆదేశించింది. ఇక నుంచి నిమజ్జనం చేసే వారిపై చార్జీలు విధించాలని కోరింది.

గణేశ్ నిమజ్జనంపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(CPCB) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నిమజ్జన వ్యర్థాలను తొలిగించేందుకు విసర్జన ఛార్జీలను వసూలు చేయాలని సూచించింది. వీటిని రాష్ట్రాల బోర్డులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా పీసీబీ వాచ్‌డాగ్‌లా వ్యవహరించాలని నిర్దేశించింది. లక్ష జనాభా మించిన టైర్‌ -1 నగరాల్లో పీసీబీ అధికారులు పర్యవేక్షణ జరుపాలని సూచించింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీవోపీ), థర్మాకోల్‌, ప్లాస్టిక్‌ వాడకంపై పూర్తిగా నిషేధం విధించింది.

నిమజ్జన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి….

తాత్కాలికంగా నిమజ్జన కొలనులను ఏర్పాటు చేయడం. విగ్రహాలను నిమజ్జనం చేశాక వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలిగించాలి.

♦ విగ్రహాలతోపాటు వచ్చే పూజా సామగ్రి, పూలవంటి వాటిని ముందుగానే తొలిగించి, కేవలం విగ్రహాలను మాత్రమే కొలనులో నిమజ్జనం చేయాలి.

♦ సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ వాడకం పూర్తిగా నిషేదించడం. ఎకో ఫ్రెండ్లీ వస్తు సామగ్రిని మాత్రమే నవరాత్రుల్లో వినియోగించాలి.

♦ విగ్రహాలను సహజ రంగులతోనే అలంకరించాలి. ఎండిన ఆకులు, పూలు, బెరడులతో తయారుచేసిన రంగులనే వినియోగించాలి.

♦ కాలుష్య తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు పీసీబీ అధికారులు నిమజ్జనానికి ముందు, నిమజ్జన మూడో, ఐదో, ఏడో, తొమ్మిది రోజుల్లో నిమజ్జన కొలనుల్లో నీటి నాణ్యతా పరీక్షలను నిర్వహించాలని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories