Coronavirus Effect : హోటళ్ల పై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా

Coronavirus Effect : హోటళ్ల పై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా
x
Highlights

Coronavirus Effect : ఘుమఘులాడే సువాసనలతో రారమ్మంటూ పిలిచే రెస్టారెంట్లు కరోనా దెబ్బ కి మూతపడ్డాయి. విశాఖ లో ప్రజెంట్ టేకే ఏవే పాయింట్స్ మాత్రమే కాస్తా...

Coronavirus Effect : ఘుమఘులాడే సువాసనలతో రారమ్మంటూ పిలిచే రెస్టారెంట్లు కరోనా దెబ్బ కి మూతపడ్డాయి. విశాఖ లో ప్రజెంట్ టేకే ఏవే పాయింట్స్ మాత్రమే కాస్తా ఊరటనిస్తున్నాయి. కానీ బయటి ఫుడ్ తీసుకుంటే భద్రతకు భంగం కలుగుతుందని జనం భయపడుతున్నారు. కోవిడ్ తో చాలా మందికి ఆరోగ్యం పై ఎనలేని శ్రద్ధ పుట్టుకవచ్చింది దీంతో ఆహారప్రియులు ఇంటి భోజనంకే ఓటేస్తున్నారు. దీంతో ఫుడ్ సెంటర్స్ డీలా పడిపోయాయి.

విశాఖపట్నంలో ఆహారప్రియులు నోరుకట్టేసుకుంటున్నారు. ఘుమఘుమ సువాసనలు వస్తున్నా మనసు చంపుకొని ఇంటిభోజనంతో సర్ధుకుంటున్నారు. విశాఖలో పెద్ద హోటల్స్ 400 కు పైగా ఉన్నాయి. ఇక స్ట్రీట్ ఫుడ్ సంగతి చెప్పక్కర్లేదు. ఈ ఫుడ్ సెంటర్లపై ఆధారపడి వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో నగరంలో హోటల్స్, రెస్టారెంట్లు మూత పడ్డాయి. దీంతో చాలా మంది ఉపాధిని కోల్పోవాల్సి వస్తోంది.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నగరంలో 70-80 వరకు టేక్ ఏవే పాయింట్స్ రన్ అవుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు వాటి నిర్వహణను గమనిస్తున్నట్లు జీవీఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు విపరీతంగా తగ్గడంతో ఫుడ్ సెంటర్స్ మూయకతప్పడం లేదని వ్యాపారాలు వాపోతున్నారు. పైగా మెయింటెన్స్ ఖర్చులు తప్పడం లేదంటున్నారు వ్యాపారులు. సిబ్బందికి జీతాలు కూడా చెల్లంచలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తమంతా రోడ్డున పడకతప్పదని ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా కరోనా వైరస్ ప్రభావం ఫుడ్ ఇండస్ట్రీ పై తీవ్రంగా పడింది. ఈ కరోనా విజృంభణ పూర్తిగా అదుపులోకి వస్తే తప్పా ఫుడ్ సెంటర్లు కొలుకునే పరిస్థితులు లేవు.




Show Full Article
Print Article
Next Story
More Stories