Bonalu Festival: మహాజాతరగా మహానగరం

Bonalu Festival Started in Hyderabad City With Police Protection
x

లాల్ ద‌ర్వాజ బోనాల జాత‌ర (ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

* ఓల్డ్ సిటీ లాల్ ద‌ర్వాజ బోనాల జాత‌రపై పోలీసులు నిఘా * 8వేల మంది పోలీసులతో భద్రత * ఇవాళ, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు

Bonalu Festival: మహానగరం మహా జాతరను తలపిస్తుంది. ఏ సెంటర్‌ను చూసినా, ఏ గల్లీని చూసినా బోనాల పండుగ సందడి కనిపిస్తోంది. ఇక ఓల్డ్ సిటీ లాల్ ద‌ర్వాజ బోనాల జాత‌రపై పోలీసులు నిఘా పెట్టారు. పండుగ ప్రశాంతంగా నిర్వహించేందుకు హైద‌రాబాద్ సీపీ 8వేల మంది పోలీసులతో పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారి ఊరేగింపు జ‌రిగే 19 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు. ఇవాళ, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అర్ధరాత్రి జరిగిన బ‌లిగంప పూజతో సింహ‌వాహిని అమ్మవారి జాతర ప్రారంభమైంది. భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ తొలి బోనం సమర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories