అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు అసెంబ్లీ మరోసారి ఆమోదం

అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు అసెంబ్లీ మరోసారి ఆమోదం
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు మరోసారి ఆమోదం పొందాయి. దాంతో మూడు రాజధానుల ప్రక్రియ మళ్ళీ మొదటికొచ్చింది. ఈసారి చర్చ లేకుండానే బిల్లులు ఆమోదం పొందాయి. అయితే ఈ బిల్లులను మరోసారి మండలికి పంపుతారు. ఒకవేళ మండలిలో ఈసారి ఆమోదం పొందకపోయినట్టయితే నెలరోజుల తరువాత ఇది ఆటోమాటిక్ గా ఆమోదం పొందుతుందని రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు.

కాగా జనవరిలో ఈ రెండు బిల్లులను అసెంబ్లీ అమోదించింది. అయితే కౌన్సిల్ లో టీడీపీ అడ్డుకోవడం, పైగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం వంటివి జరిగాయి. ఆ తరువాత మూడు రాజధానుల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పరిణామాలతో వైసీపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ పార్లమెంటుకు తీర్మానం పంపించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories