Hanuman Jayanti: హనుమాన్ జయంతి ప్రాముఖ్యత

Hanuman Jayanti Importance
x

హనుమాన్ జయంతి (ఫొటో ట్విట్టర్)

Highlights

Hanuman Jayanti: హనుమాన్ జయంతి ఎప్పుడు నిర్వహిచుకోవాలి? అసలు జయంతి ప్రాముఖ్యత ఏంటి? అని చాలా మందికి తెలియక పోవచ్చు.

Hanuman Jayanti: హనుమాన్ జయంతి ఎప్పుడు నిర్వహిచుకోవాలి? అసలు హనుమాన్ జయంతి ప్రాముఖ్యత ఏంటి? అని చాలా మందికి తెలియక పోవచ్చు. పరాశర సంహిత అనే గ్రంథంలో వివరించిన దాని ప్రకారం హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించాడని పేర్కొన్నారు. దీంతో అదే రోజున హనుమాన్ జయంతి నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. అయితే మరో కథనం ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడితో సహా మరికొంతమంది రాక్షసులను హనుమంతుడు వధించి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ టైంలోనూ హనుమాన్ జయంతి చేసుకోవచ్చని తెలిపారు.

దీంతో ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం పేరుతో కొన్ని చోట్ల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఉత్తరాదిలో హనుమాన్ జయంతిగా నిర్వహిస్తారు. చైత్ర పూర్ణిమ నుంచి 41 రోజుల పాటు భక్తులు ఆంజనేయ దీక్ష ధరిస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్లీ హనుమన్ జయంతి చేసుకుంటారు.

ఈ 41 రోజులపాటు హనుమంతుడి ఉత్సవాలను చేపడతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున హనుమాన్‌ చాలీసా, హనుమద్దండకం ఇతర శ్లోకాలతో స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పెద్దలు చెబుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories