పాము వంపుల నడక...

పాము వంపుల నడక...
x
Highlights

పాములు అటూ ఇటూ వంపులు చేసుకుంటూనే ఎందుకు వెళుతుందో మీకు తెలుసా! మనుషులు, పశువుల వంటి పాదచారుల విషయంలో కాళ్లు ఒకటి తర్వాత మరొకటిగా నేల మీద ఆనుతూ, పైకి...

పాములు అటూ ఇటూ వంపులు చేసుకుంటూనే ఎందుకు వెళుతుందో మీకు తెలుసా! మనుషులు, పశువుల వంటి పాదచారుల విషయంలో కాళ్లు ఒకటి తర్వాత మరొకటిగా నేల మీద ఆనుతూ, పైకి లేస్తూ ఉండడం అందరూ గమనించే విషయమే. ఇలా చేసినప్పుడే న్యూటన్‌ మూడవ గమన సూత్రం ప్రకారం ప్రతి చర్య ఏర్పడి చలనం సాధ్యమవుతుంది. అయితే కాళ్లు, పాదాలు లేని పాముల్లాంటి జీవుల చలనానికి వాటి శరీరంపై ఉండే పొలుసులే ఆధారం. పాము విషయంలో దాని పొట్ట కింద ఉండే పొలుసుల్లో కొన్ని నేలను పట్టి వెనక్కి నెట్టుతుంటే, మరికొన్ని నేలను అంటుకోకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇలా జరగాలంటే రెండే పద్ధతుల్లో సాధ్యమవుతుంది. నేలను అంటిన భాగం కాకుండా మిగతా శరీర భాగం భూమికి లంబంగా ఉండాలి. లేదా నేలను అంటిన భాగం కాకుండా మిగతాది నేలకు సమాంతరంగా గానైనా ఉండాలి. ఈ రెండూ కాని పక్షంలో నేలను ఆనుకుని ఉండే శరీరభాగాన్ని వ్యాకోచింప చేసుకోవాలి. మొదటి పద్ధతిలో గొంగళిపురుగుల్లాంటివి పాకడాన్ని గమనిస్తాం. ఇక చివరి విధానంలో వానపాముల చలనం ఉంటుంది. ఈ రెండు పద్ధతులకు పాము శరీరం అనుకూలంగా ఉండకపోవడం వల్ల అది మరో పద్ధతిని పాటిస్తుంది. అందుకే వంకరటింకర నడక, పరుగు. శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories