చల్ల గాలి ఎసి యంత్రం నుంచి ఎలా ఎలా ఎలా!

చల్ల గాలి ఎసి యంత్రం నుంచి ఎలా ఎలా ఎలా!
x
Highlights

ఇప్పుడు రోజు రోజుకి ఎండలు పెరిగి వేడిగాలి పెరుగుతుంది, అయితే ఇలాంటి సమయంలో ఎసి వుంటే చల్లగా వుంటుంది అనిపిస్తుంది. అయితే అసలు ఈ ఎసి యంత్రం నుంచి చల్ల...

ఇప్పుడు రోజు రోజుకి ఎండలు పెరిగి వేడిగాలి పెరుగుతుంది, అయితే ఇలాంటి సమయంలో ఎసి వుంటే చల్లగా వుంటుంది అనిపిస్తుంది. అయితే అసలు ఈ ఎసి యంత్రం నుంచి చల్ల గాలి ఎలా వస్తుందో మీకు తెలుసా! వాయువుల్లో వాస్తవ వాయువులు, ఆదర్శ వాయువులు అనే రెండు రకాలున్నాయి. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని పరస్పరం మార్చుకోవచ్చును. ఇందులో వాస్తవ వాయు ధర్మాల్లో ఓ ప్రధాన ధర్మం జౌల్‌ థామ్సన్‌ గుణకం. ఓ వాయువును బాగా సంపిలినీకరణం చేశాక ఒక్కసారిగా విరళీకరణానికి గురిచేస్తే ఆ వాయువు ఉష్ణోగ్రత పడిపోయే ధర్మానికి జౌల్‌ థామ్సన్‌ గుణకం ఓ కొలబద్ద. ఇది క్లోరో ఫ్లోరో కార్బన్‌ బృందానికి చెందిన ఫ్రియాన్‌ వాయువుకు చాలా ఎక్కువ. అందుకే ఏసీ యంత్రాల తయారీలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ప్రత్యేక మోటారుతో మొదట ఫ్రియాన్‌ వాయువును అధిక పీడనానికి లోను చేస్తారు. అలా అధిక పీడనంలో ఉన్న ఫ్రియానును జల్లెడలాగా అంటే గొట్టాల చట్రంలోకి విస్తరించినపుడు ఆ గొట్టాలు చల్లబడతాయి. ఆ గొట్టాల మీదుగా గాలి పదేపదే చక్రీయంగా వెళ్లేలా చేయడం వల్ల గదిలో గాలి క్రమేణా కూడా చల్లబడుతుంది. ఏసీ యంత్రాలు, రిఫ్రిజరేటర్లు పనిచేసేది ఈ యంత్రాంగం ఆధారంగానే.శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories