మామిడి పండ్లు ఎందుకు వేసవికాలములోనే ఎక్కువగా దొరుకుతాయో మీకు తెలుసా!

మామిడి పండ్లు ఎందుకు వేసవికాలములోనే ఎక్కువగా దొరుకుతాయో మీకు తెలుసా!
x
Highlights

మామిడి పండ్లు ఎందుకు వేసవికాలములోనే ఎక్కువగా దొరుకుతాయో మీకు తెలుసా! మామిడిపండ్లు కాలం వచ్చేసింది, మామిడి పండుని ఇష్టపడని వారు చాల తక్కువే అని...

మామిడి పండ్లు ఎందుకు వేసవికాలములోనే ఎక్కువగా దొరుకుతాయో మీకు తెలుసా! మామిడిపండ్లు కాలం వచ్చేసింది, మామిడి పండుని ఇష్టపడని వారు చాల తక్కువే అని చెప్పాలి, ప్రపంచం మొత్తం మీద దాదాపు 600 రకాల పండ్లున్నాయని శాస్త్రవేత్తల అంచనా. ఇటువంటి రుచికరమైన పండ్లు సంవత్సరం పొడుగునా దొరికితే ఎంత బావుంటుందో! కానీ అలా దొరకవు కదా! వేసవిలోనే దొరుకుతాయి. ఉగాది వచ్చిందంటే వేపపూత పూస్తుంది. మామిడిచెట్లూ ఏపుగా పూచి, పిందెలు వేస్తాయి. అప్పటి నుండి రెండు మూడు నెలలు మాత్రమే కాయలు, పండ్లు దొరుకుతాయి. పరిశీలించి చూడండి.. రకరకాల వృక్షాలు కొన్ని ఋతువుల్లో మాత్రమే పుష్పిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందని అమెరికా దేశ శాస్త్రజ్ఞులు డబ్ల్యు. డబ్ల్యు.గార్నరు, ఎం.ఎ.అల్లార్టు అనేవారు 1918లో పరిశోధనలు జరిపారు. వృక్షాలు పుష్పించటం సూర్యరశ్మి లభించే కాలంపై ఆధారపడి ఉంటుందని కనుగొన్నారు. కొన్ని ఋతువుల్లో త్వరగా సూర్యాస్తమయం అవుతుంది. వసంతఋతువు నుండ పగటి కాలం అధికమవుతుంది. జూన్‌ 21కి తక్కువ వస్తుంది. తరువాత పగటికాలం తగ్గుతూ, డిసెంబరు 21 నాటికి చాలా తగ్గిపోతుంది. పగటికాలం అధికంగా ఉన్నప్పుడు కొన్నిరకాల మొక్కలు పుష్పిస్తాయి. వీటినే 'దీర్ఘ దిన పుష్పితాలు' (లాంగ్‌ డే ప్లాంట్స్‌) అంటారు. మామిడి, వేప ఆ కోవకు చెందినవే. అందుకే మనకు మామిడికాయలు వేసవిలో మాత్రమే దొరుకుతాయట. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories