ఆవిరి పైకే ఎందుకు!

ఆవిరి పైకే ఎందుకు!
x
Highlights

మీరు స్టొవ్ పై నీరు మరుగుతున్నప్పుడు దానిని మీరు గమనిస్తే, దాని నుండి ఆవిరి వస్తుంటుంది, అయితే ఆ నీటి ఆవిరి పైకే ఎందుకు వెళుతుందో మీకు తెలుసా? నీటి...

మీరు స్టొవ్ పై నీరు మరుగుతున్నప్పుడు దానిని మీరు గమనిస్తే, దాని నుండి ఆవిరి వస్తుంటుంది, అయితే ఆ నీటి ఆవిరి పైకే ఎందుకు వెళుతుందో మీకు తెలుసా? నీటి ఆవిరి వంద డిగ్రీల సెల్సియస్‌ కన్నా అధిక ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది.దీని సాంద్రత తక్కువగా ఉంటుంది. సాధారణ గాలి వేసవి కాలంలో అయినా 45 డిగ్రీల సెల్సియస్‌కు మించదు. అందువల్ల వేడి నీటి ఆవిరి సాంద్రత తక్కువగా ఉంటుంది. ప్లవన సూత్రాల ప్రకారం తక్కువ సాంద్రత గల పదార్థాలు, ఎక్కువ సాంద్రతగల ప్రాంతాలపైకి విస్తరిస్తాయి. అందువల్ల వేడి ఆవిర్లు పైపైకే పాకుతాయిగానీ, కిందివైపునకు పడవు. పైకి పాకుతున్న క్రమంలో ఉష్ణోగ్రత సమతాస్థితి పొంది గాలిలో సమానంగా ఆవిరి కలిసిపోతుందట. శ్రీ.కో

Show Full Article
Print Article
Next Story
More Stories