మన దేశంలో ఆల్ ఇండియా రేడియో!

మన దేశంలో ఆల్ ఇండియా రేడియో!
x
Highlights

మన దేశంలో ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు మొదలయ్యిందో మీకు తెలుసా! మన దేశంలో ఆల్ ఇండియా రేడియోగా 8 జూన్ 1936 నాడు ప్రారంభం అయ్యింది. కాని అప్పటికే బాంబే...

మన దేశంలో ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు మొదలయ్యిందో మీకు తెలుసా! మన దేశంలో ఆల్ ఇండియా రేడియోగా 8 జూన్ 1936 నాడు ప్రారంభం అయ్యింది. కాని అప్పటికే బాంబే ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ మరియు ఇతర రేడియో క్లబ్ల కార్యక్రమాలతో బ్రిటీష్ రాజ్ సమయంలో జూన్ 1923 లో బ్రాడ్కాస్టింగ్ ప్రారంభమైంది. 23 జూలై 1927 న ఒక ఒప్పందం ప్రకారం ప్రైవేట్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఐబిసి) రెండు రేడియో స్టేషన్లను నిర్వహించటానికి అధికారం పొందింది: బొంబాయి స్టేషన్ 23 జూలై 1927 న మొదలైంది మరియు ఇది ఆగస్టు 26, 1927 న కలకత్తా స్టేషన్ను ప్రారంభించింది. 1 మార్చి 1930 న ప్రభుత్వం పరివర్తనా సౌకర్యాలను చేపట్టింది మరియు రెండు సంవత్సరాల కోసం ప్రయోగాత్మక ప్రాతిపదికన ఏప్రిల్ 1, 1930 న భారత రాష్ట్ర బ్రాడ్క్యాస్టింగ్ సర్వీస్ (ఐఎస్బిఎస్) ను ప్రారంభించింది, అయితే ఆతర్వాత శాశ్వతంగా ఆల్ ఇండియా రేడియోగా 8 జూన్ 1936 న ప్రారంభించబడింది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories