Fascino S: ఫాసినో నుంచి కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఫీచర్స్‌ మాములుగా లేవు..!

Yamaha Launches Fascino S in India Check Here for Features and Price Details
x

Fascino S: ఫాసినో నుంచి కొత్త వేరియంట్ వచ్చేసింది.. ఫీచర్స్‌ మాములుగా లేవు..!

Highlights

Fascino S: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ యమహా స్కూటర్‌ సెగ్మెంట్‌లో తనదైన ముద్ర వేస్తోంది.

Fascino S: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ యమహా స్కూటర్‌ సెగ్మెంట్‌లో తనదైన ముద్ర వేస్తోంది. ఇప్పటికే ఫాసినోపాటు మరికొన్ని మోడల్స్‌ తీసుకొచ్చి స్కూటర్‌ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకర్షించిన యమహా తాజాగా ఫాసినో స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఫాసినో ఎస్‌ పేరుతో భారత మార్కెట్లోకి ఈ కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేశారు. అధునాత ఫీచర్స్‌తో ఈ స్కూటీని లాంచ్‌ చేశారు. ఇంతకీ ఫాసినో ఎస్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

యమహా ఫాసినో ఎస్‌ వేరియంట్‌లో 125 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజన్‌ను అందించారు. ఇది 8.2 హార్స్ పవర్‌తో పాటు 10.3 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ స్కూటర్‌ బరువు 99 కేజీలుగా ఉంది. అండర్‌ సీట్ స్టోరేజ్‌ను 21 లీటర్లుగా అందించారు. దీంతో సులభంగా హెల్మెట్‌ను పెట్టుకోవచ్చు. ఈ స్కటర్‌ను మ్యాట్‌ రెడ్‌, మ్యాట్‌ బ్లాక్‌, డార్క్‌ మ్యాట్ బ్లూ కలర్స్‌లో తీసుకొచ్చారు. యమహా ఫాసినో ఎస్‌ను డ్రమ్‌, డిస్క్‌ వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. ఇక ఈ స్కూటర్‌ను యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.

ఆన్సర్‌ బ్యాక్‌ మొబైల్‌ యాప్‌తో కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో యాక్టివేట్ అయినప్పుడు స్కూటర్ రెండు సెకన్ల పాటు హారన్ సౌండ్‌ చేయడమే కాకుండా ఎడమవైపు, కుడివైపు ఉన్న ఇండికేటర్స్ ఎంగేజ్ అవుతాయి. దీంతో పార్కింగ్‌లో ఎన్ని వెహికిల్స్ మధ్య పార్క్‌ చేసినా మీ స్కూటర్‌ను ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఈ ఫీచర్ స్టాండర్డ్ ఫాసినో స్కూటర్‌లో లేదు.

డిజైన్‌ పరంగా చూస్తే ఇంతకు ముందు వచ్చిన మోడల్ మాదిరిగానే అందించారు. ఇక ధర విషయానికొస్తే యమహా ఫాసినో డ్రమ్‌ బ్రేక్‌ ధర ఢిల్లీ ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌ రూ. 93,700గా ఉంది (మ్యాట్ రెడ్‌, మ్యాట్‌ బ్లాక్‌ కలర్స్‌). అదే విధంగా టాప్‌ ఎండ్ డార్క్‌ మాట్‌ బ్లూ కలర్‌ ధర రూ. 94,530 ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌గా ఉంది. ఇదిలా ఉంటే ఈ స్కూటర్‌ను యమహా.. ప్రస్తుతం భారత మార్కెట్లో సత్తా చాటుతోన్న సుజుకి యాక్సెస్‌ 125, హోండా యాక్టివా 125, టీవీఎస్‌ జుపీటర్‌ 125లకి పోటీ ఇవ్వనుందని అనడంలో సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories