Car Tips and Tricks: కార్ సైడ్ మిర్రర్‌పై రాసి ఉన్న ఈ హెచ్చరిక ఏంటో తెలుసా.. తెలుసుకోకుంటే ప్రమాదంలో పడ్డట్లే..!

Warning Sings on Car Side Mirror to Prevent Road Accident Check Here Full Details
x

Car Tips and Tricks: కార్ సైడ్ మిర్రర్‌పై రాసి ఉన్న ఈ హెచ్చరిక ఏంటో తెలుసా.. తెలుసుకోకుంటే ప్రమాదంలో పడ్డట్లే..!

Highlights

Safety Tips to Prevent Road Accident: చాలా మందికి కారు నడపడం తెలుసు. అయితే, కారు బాగా నడపడం ఒక కళగా భావిస్తుంటారు.

Safety Tips to Prevent Road Accident: చాలా మందికి కారు నడపడం తెలుసు. అయితే, కారు బాగా నడపడం ఒక కళగా భావిస్తుంటారు. అలాగే, కారును సరిగ్గా నడపాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడం చాలా ముఖ్యం. దీనితో పాటు, మీ వాహనంపై అనేక రకాల సమాచారం కూడా రాసి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే, అనేక రకాల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు.

కారు సైడ్ మిర్రర్‌పై హెచ్చరికలు?

కారు సైడ్ మిర్రర్ మీద హెచ్చరిక రాసి ఉంది. డ్రైవింగ్‌లో రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ హెచ్చరిక. వెనుక నుంచి వచ్చే వాహనాలను చూసేందుకు కారుకు అద్దం అమర్చారు. ఈ అద్దంలో చూసుకుంటే వెనుక వాహనాల దూరం, వేగాన్ని అంచనా వేయవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ ఈ అద్దంలోకి చూస్తూ ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ అద్దం సహాయంతో మాత్రమే డ్రైవర్ వెనుక నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సరిగ్గా గుర్తించగలడు.

ఈ హెచ్చరిక అర్థం ఏమిటి?

కారు సైడ్ మిర్రర్ మీద ఇంగ్లీషులో రాసిన నోట్ ఉంది.'అద్దంలో ఉన్న వస్తువులు అవి కనిపించే దానికంటే దగ్గరగా ఉంటాయి'.

'వెనక వచ్చే వాహనాలు కనిపించినంత దూరంలో ఉండవు' అని ఈ నోటు అర్థం. దీని వెనుక అసలు కారణం ఏమిటంటే, కారు అద్దంలో కుంభాకార అద్దం ఉంటుంది. ఇది సాధారణ అద్దం కంటే భిన్నంగా ఉంటుంది.

భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలలో, ఈ హెచ్చరికను సైడ్ మిర్రర్‌పై రాసి ఉంచుతారు. తద్వారా ప్రజలు కారు నడుపుతున్నప్పుడు దీన్ని గుర్తుంచుకోవాలి. కారు డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా, డ్రైవర్ ఈ అద్దంలో కనిపించే వాహనాలను మెరుగైన రీతిలో అంచనా వేయగలడు. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories