Mahindra be 05: ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో మతిపోగొడుతోన్న మహీంద్రా ఈవీ.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో తెలుసా?

Upcoming Mahindra be 05 spotted in Ladakh during the testing check price and features
x

Mahindra be 05: ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో మతిపోగొడుతోన్న మహీంద్రా ఈవీ.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో తెలుసా?

Highlights

Mahindra & Mahindra: మహీంద్రా తన సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV)తో మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులకు సిద్ధమవుతోంది. ఇటీవల XUV.e9, BE.05 అనే రెండు EV మోడల్‌లను టెస్టింగ్ చేసింది.

Mahindra & Mahindra: మహీంద్రా తన సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV)తో మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులకు సిద్ధమవుతోంది. ఇటీవల XUV.e9, BE.05 అనే రెండు EV మోడల్‌లను టెస్టింగ్ చేసింది. ఈ రెండూ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమాణాలను సరికొత్తగా సెట్ చేసేందుకు సిద్ధమైంది.

మహీంద్రా BE.05..

BE.05 దాని ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో దృష్టిని ఆకర్షిస్తుంది . యూకే షోకేస్ సందర్భంగా, మహీంద్రా ప్రొడక్షన్ మోడల్‌లో కాన్సెప్ట్‌ను చేర్చడం గురించి సూచించింది. ఇది ఇటీవలి స్పై షాట్‌లలో కూడా కనిపిస్తుంది.

మహీంద్రా BE.05 డిజైన్..

ఫ్రంట్ ఫాసియా భారీ LED డేటైమ్ రన్నింగ్ లైట్లను (DRLs) కలిగి ఉంది. ఇది ఒక ముఖ్యమైన డిజైన్ అంశం. వెనుక భాగం వైల్డ్, అవాంట్-గార్డ్ టెయిల్ లైట్ LED సిగ్నేచర్‌తో ఆకర్షిస్తుంది. ఇది సాంప్రదాయ డిజైన్‌ల నుంచి భిన్నమైన రూపాన్ని ఇస్తుంది. చిన్న వెనుక విండ్‌షీల్డ్ పైన ఉన్న స్పోర్టి రూఫ్ స్పాయిలర్ దాని ఏరోడైనమిక్ అప్పీల్‌ను జోడిస్తుంది. సైడ్ ప్రొఫైల్ కోణీయంగా ఉంటుంది. BE.05 షీట్ మెటల్‌ను కలిగి ఉంది. ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories