Upcoming Cars And Bikes: ఫుల్ జోష్‌లో ఆటో మార్కెట్.. నవంబర్‌లో రోడ్లపైకి రానున్న కార్లు, బైకులు ఇవే..!

Upcoming Cars And Bikes In November 2024
x

Upcoming Cars And Bikes In November 2024

Highlights

Upcoming Cars And Bikes In November 2024: దేశంలో పండుగ సీజన్ ఉపందుకుంది. ఆటోమొబైల్ కంపెనీలు భారీ లాభాలను ఆర్జించేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

Upcoming Cars And Bikes In November 2024: దేశంలో పండుగ సీజన్ ఉపందుకుంది. ఆటోమొబైల్ కంపెనీలు భారీ లాభాలను ఆర్జించేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అయితే ఈ సీజన్‌లో సరికొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు కార్ల తయారీదారులు సిద్ధమయ్యారు. అనేక కంపెనీలు సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌‌లోకి తీసుకొచ్చేందుకు వరుసలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో రోడ్లపైకి రానున్న కార్లు, బైక్‌లు స్కూటర్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Maruti Suzuki Dzire

మారుతి సుజుకి నెక్స్ట్ జెన్ డిజైర్‌ను నవంబర్ 11న విడుదల చేయనుంది. ఇందులో సబ్ 4 మీటర్ సెడాన్ రిఫ్రెష్డ్ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌ ఉంటుంది. కొత్త డిజైర్ ఫీచర్ లిస్ట్‌లో సన్‌రూఫ్, కొత్త ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్‌గ్రేడ్ చేసిన డిజైర్ దాని ఇంజన్ కొత్త స్విఫ్ట్‌తో సమానంగా ఉంటుంది. అంటే ఇది మాన్యువల్ఆ, టోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో 1.2 లీటర్ మూడు సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది.

Skoda KylaqV

స్కోడా నవంబర్ 6న భారతదేశంలో తన మొదటి సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ కైలాక్‌ను విడుదల చేస్తుంది. ఈ కొత్త స్కోడా ఎస్‌యూవీ 2025 మొదటి త్రైమాసికంలో సేల్‌కి వస్తుంది. అయితే ఇందులో సింగిల్ పవర్‌ట్రెయిన్ 1.0 లీటర్, మూడు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఇదే యూనిట్ కుషాక్‌‌లో కూడా అందించారు.

Brixton Cromwell 1200

బ్రిక్స్టన్ మోటార్‌సైకిల్స్ నవంబర్ 2024లో భారతదేశంలో నాలుగు మోటార్‌సైకిళ్లను విడుదల చేయనుంది. వీటిలో క్రాస్‌ఫైర్ 500 X, క్రాస్‌ఫైర్ 500 XC, క్రోమ్‌వెల్ 1200, క్రోమ్‌వెల్ 1200 X ఉన్నాయి. క్రాస్‌ఫైర్ రేంజ్ 500cc ఇన్‌లైన్ టూ సిలిండర్ 4 హర్బ్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. క్రోమ్‌వెల్ రేంజ్‌లో 1200 సీసీ వాటర్-కూల్డ్ ఇన్‌లైన్ ట్విన్ సిలిండర్ ఇంజన్ 81 హెచ్‌పి పవర్ అందిస్తుంది. వీటి బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

Royal Enfield Bear 650

రాయల్ ఎన్‌ఫీల్డ్ నవంబర్ 5న బేర్ 650ని విడుదల చేస్తుంది. ఇది 650సీసీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా బైక్ తయారైన మొదటి స్క్రాంబ్లర్. సమాచారం ప్రకారం దీనిలో చంకియర్ టైర్లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, కొత్త సీటు, రివైజ్డ్ పిలియన్ గ్రాబ్ రైల్స్ వంటి ఆల్-టెర్రైన్ అప్‌గ్రేడ్‌లతో ఇంటర్‌సెప్టర్ 650 బేస్ స్క్రాంబ్లర్‌ ఉన్నాయి. దీనిలో 648cc సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది.

Hero Destini 125

నవంబర్ 2024లో నెక్స్ట్-జెన్ డెస్టినీ 125ని భారతదేశంలో లాంచ్ కానుంది. కొత్త డెస్టినిన్ 125 రిఫ్రెష్డ్ డిజైన్, మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఇది మునుపటి మోడల్ మాదిరిగానే 124.6 సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇంజన్ 9 హెచ్‌పి, 10.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories