TVS Jupiter: టీవీఎస్ నుంచి కొత్త స్కూటర్.. రూ. 76 వేలతో రేపే లాంచ్..!

TVS Jupiter
x

TVS Jupiter

Highlights

TVS Jupiter: టీవీఎస్ అప్‌డేటెడ్ కొత్త జుపిటర్‌ని ఆగస్టు 22న లాంచ్ చేయనుంది. దీని ధర రూ. 76 వేలుగా ఉంటుంది.

TVS Jupiter: దేశంలో స్కూటర్ల వినియోగం భారీగా పెరిగింది. ఇంట్లో ఒక స్కూటీ ఉంటే ఇంటిళ్లపాదికి ఉపయోగంగా ఉంటుందని చాలా మంది స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన డిమాడ్ కారణంగా కంపెనీలు సరికొత్త స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. అలానే పాత మోడళ్లను లేటెస్ట్ టెక్నాలజీతో అప్‌డేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ TVS మోటార్స్ ద్వారా అనేక అద్భుతమైన స్కూటర్లు, బైక్‌లను అందిస్తోంది. తాజాగా కొత్త స్కూటర్ TVS జూపిటర్ 110ని ఆగస్టు 22న లాంచ్ చేయనుంది. కొత్త స్కూటర్‌ని ఎలాంటి ఇంజన్ ఫీచర్లతో తీసుకురావచ్చు? దాని సాధ్యమైన ధర ఎంత? తదితర వివరాలను తెలుసుకుందాం.

ఆగస్ట్ 22న టీవీఎస్ కొత్త స్కూటర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం కంపెనీ కొత్త ఫీచర్లు, గ్రాఫిక్‌లతో ఇప్పటికే ఉన్న TVS జూపిటర్ 110ని అప్‌డేటెడ్ వెర్షన్‌గా తీసుకురానుంది. అంతేకాకుండా దాని ధరను కూడా స్వల్పంగా పెంచవచ్చు. మార్కెట్లో కొత్త స్కూటర్‌ను విడుదల చేయడానికి ముందు, టీవీఎస్ సోషల్ మీడియాలో కొత్త టీజర్‌ను విడుదల చేసింది. దీనిలో స్కూటర్ కొత్త LED DRLలు కనిపిస్తాయి. కంపెనీ తన కొత్త స్కూటర్‌లో కొన్ని ప్రత్యేక మార్పులు చేసే అవకాశం ఉంది.

టీవీఎస్ జూపిటర్ 110 ఫేస్‌లిఫ్ట్‌‌లో అనేక కొత్త ఫీచర్లు ఉంటాయి. స్కూటర్‌లో USB పోర్ట్‌ను కూడా అందించవచ్చు. ఇది కాకుండా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, LED హెడ్‌లైట్లు, మెరుగైన గ్రాఫిక్స్‌తో తీసుకురావచ్చు. ఇంజిన్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం ఉన్న 109.7 సీసీ కెపాసిటీ ఉన్న ఇంజన్ మాత్రమే ఇందులో ఇవ్వవచ్చు. దీని కారణంగా ఇది 7.77 బిహెచ్‌పి పవర్, 8.8 న్యూటన్ మీటర్ టార్క్ రిలీజ్ చేస్తుంది.

TVS నుండి ప్రస్తుతం ఉన్న జూపిటర్ 110 స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 73650, అయితే కొత్త వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధరను కొద్దిగా పెంచవచ్చు. దీనిని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.76 వేల వరకు ఉండొచ్చు. ఇది హోండా యాక్టివాతో పోటీ పడుతోంది. జూపిటర్‌ను టీవీఎస్ 110, 125 సిసి విభాగాలలో విక్రయానికి అందుబాటులో ఉంచింది. 110 సిసి సెగ్మెంట్ మార్కెట్లో హోండా యాక్టివా, హోండా డియో, హీరో జూమ్, హీరో ప్లెజర్ ప్లస్ వంటి స్కూటర్లతో నేరుగా పోటీపడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories