TVS Motors: అదరహో అనిపించిన టీవీఎస్.. భారీగా పెరిగిన అమ్మాకాలు

TVS Motors
x

TVS Motors

Highlights

TVS Motors: భారత మార్కెట్లో టీవీఎస్ విక్రయాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ అక్టోబర్ 2024లో తన విక్రయాలలో విపరీతమైన పెరుగుదలను నమోదు చేసింది.

TVS Motors: భారత మార్కెట్లో టీవీఎస్ విక్రయాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ అక్టోబర్ 2024లో తన విక్రయాలలో విపరీతమైన పెరుగుదలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం 4,89,015 యూనిట్లను సేల్ చేసింది. ఇది గత ఏడాది అక్టోబర్‌లో విక్రయించిన 4,34,714 యూనిట్లతో పోలిస్తే 12.49 శాతం ఎక్కువ. ఇప్పుడు కంపెనీ వార్షిక, నెలవారీ విక్రయాలను పరిశీలిద్దాం.

TVS మోటార్ అక్టోబర్ 2024లో 3W ఎగుమతులు మినహా అన్ని విభాగాలలో అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. మోటార్‌సైకిల్ విక్రయాలు 2,01,965 యూనిట్ల నుంచి 2,30,822 యూనిట్లకు 14.29 శాతం వృద్ధిని సాధించింది.

స్కూటర్ అమ్మకాలు కూడా సంవత్సరానికి రెండంకెల వృద్ధిని సాధించాయి. 1,65,135 యూనిట్ల నుండి 1,93,439 యూనిట్లకు పెరిగాయి. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల గురించి మాట్లాడితే గత నెలతో పోలిస్తే అమ్మకాలు 45.43 శాతం పెరిగి 29,308 యూనిట్లకు చేరుకున్నాయి.

నెలవారీ (MoM) ప్రాతిపదికన TVS మోటార్ మొత్తం 2+3W అమ్మకాలలో 1.35 శాతం వృద్ధిని సెప్టెంబర్ 2024లో విక్రయించిన 4,82,495 యూనిట్ల నుండి అక్టోబర్ 2024లో 4,89,015 యూనిట్లకు నమోదు చేసింది.

మోటార్ సైకిల్ విక్రయాలు 0.68 శాతం పెరగగా స్కూటర్ అమ్మకాలు 3.58 శాతం పెరిగాయి. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల గురించి మాట్లాడితే ఇ-స్కూటర్ అమ్మకాలలో MoM 1.41 శాతం పెరుగుదల ఉంది.

మొత్తంమీద టీవీఎస్ మోటార్ విక్రయాల నివేదికను పరిశీలిస్తే అక్టోబర్ 2024లో కంపెనీ అద్భుతంగా పనిచేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్‌లో పుంజుకుంది. రాబోయే నెలల్లో కూడా కంపెనీ మంచి అమ్మకాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories