TVS Jupiter Sales: సేల్స్‌లో దూసుకెళ్లిన టీవీఎస్ జూపిటర్.. 70 లక్షల మంది కొనేశారు

TVS Jupiter crosses 7 million unit sales milestone in Indian market
x

TVS Jupiter Sales: సేల్స్‌లో దూసుకెళ్లిన టీవీఎస్ జూపిటర్.. 70 లక్షల మంది కొనేశారు

Highlights

TVS Jupiter Sales: టీవీఎస్ జూపిటర్ బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ 2.0 సిస్టమ్‌ను కూడా పొందచ్చు, ఇది తక్కువ వేగంతో స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి రూపొందించారు.

TVS Jupiter Sales: స్కూటర్లు సౌలభ్యం పరంగా భారతీయుల మనసులను గెలుచుకున్నాయి. గేర్‌లెస్ మోడల్స్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన హోండా కైనెటిక్ తర్వాత భారతీయులు స్కూటర్లను కొనుగోలు చేసేలా చేసిన వాహనం హోండా యాక్టివా. ఇది అప్పటి నుండి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా ఉంది. అయితే భారతీయులకు రెండవ ఎంపిక ఉంటే, అది నిస్సందేహంగా టీవీఎస్ జూపిటర్ అనే అభిప్రాయం కూడా ఉంది. 2013లో విడుదలైన ఈ మోడల్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో రెండోదిగా నలిచింది.

ఇప్పుడు భారతీయ మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ 70 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. మొదటగా 110CC మోడల్‌గా పరిచయం చేయగా, తర్వాత 125CC వెర్షన్‌లో గతేడాది నవంబర్‌ వరకు 71,40,927 యూనిట్లను విక్రయించింది. టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం స్కూటర్ అమ్మకాల 11.48 మిలియన్లలో 62 శాతం జూపిటర్‌దే అంటే ఆ మోడల్ సేల్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

మంచి మైలేజ్, పనితీరు, ప్రాక్టికాలిటీ, ఫీచర్లతో కూడిన ఫ్యామిలీ స్కూటర్ సెటప్‌తో, జూపిటర్ కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మరిన్ని అప్‌డేట్‌లతో కొత్త తరానికి అప్‌గ్రేడ్ చేసిన మోడల్ మార్కెట్ నుండి గొప్ప ఆదరణ పొందుతుంది.

ఈ కొత్త జనరేషన్ స్కూటర్ కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, పర్ఫామెన్స్ కలయికగా కంపెనీ చెబుతోంది. రూ. 73,700, రూ. 87,250 ఎక్స్-షోరూమ్ ధర మధ్య ఉన్న ఈ స్కూటర్ బేస్ డ్రమ్, డ్రమ్ అల్లాయ్, డ్రమ్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ , డిస్క్ స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ అనే నాలుగు విభిన్న వేరియంట్‌లలో లభిస్తుంది. కొత్త స్కూటర్‌ను మోడల్ ఎర్గోనామిక్ డిజైన్‌తో పాటు రైడర్ సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ తయారు చేశారు.

టీవీఎస్ జూపిటర్ 110CC మోడల్ డాన్ బ్లూ, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ గ్లోస్, టైటానియం గ్రే మ్యాట్, లూనార్ వైట్ గ్లోస్, మెటియోర్ రెడ్ గ్లోస్ వంటి అనేక రకాల కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. జూపిటర్ 125CC ని రూపొందించడానికి ఉపయోగించిన అదే ఛాసిస్‌పై ఈ కొత్త ఫ్యామిలీ స్కూటర్‌ను నిర్మించినట్లు కంపెనీ పేర్కొంది. టర్న్ ఇండికేటర్‌లతో కూడిన విస్తృత LED DRL ముందు భాగంలో ప్రధాన ఆకర్షణ.

కంపెనీ LED హెడ్‌లైట్లు, LED టెయిల్ లైట్లను కూడా ఫీచర్స్ కింద యాడ్ చేసింది. సౌకర్యవంతంగా ఉంచిన హ్యాండిల్‌బార్, పెద్ద ఫ్లోర్‌బోర్డ్, వివిధ రైడర్‌లకు సరిపోయే సీటు ఎత్తు ఇవన్నీ జూపిటర్‌ను గొప్ప కుటుంబ స్కూటర్‌గా మార్చే అంశాలు. ఇతర ఫీచర్లలో ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్, రెండు ఫుల్-ఫేస్ హెల్మెట్‌లను అమర్చగల అండర్‌సీట్ స్టోరేజ్, ఒక ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఉన్నాయి.

టీవీఎస్ జూపిటర్ బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ 2.0 సిస్టమ్‌ను కూడా పొందచ్చు, ఇది తక్కువ వేగంతో స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి రూపొందించారు. ఏది ఏమైనా అమ్మకాల్లో కొత్త పుంతలు తొక్కిన టీవీఎస్ స్కూటర్ దిగ్విజయ ప్రయాణం మైళ్ల దూరం సాగుతుందనడంలో సందేహం లేదు. భారతదేశంలో, జూపిటర్ హోండా యాక్టివా వంటి ప్రత్యర్థులతో పోటీపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories