TVS Ronin Price Cut: ఇలాంటి ఆఫర్ మిస్ చేస్తే ఎలా.. భారీగా తగ్గిన TVS రోనిన్ ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?

TVS Ronin Price Cut
x

TVS Ronin Price Cut

Highlights

TVS Ronin Price Cut: TVS రోనిన్ ధరలను తగ్గించింది. ఇప్పుడు ప్రతి వేరియంట్‌ను రూ.15 వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

TVS Ronin Price Cut: భారతదేశంలోని ప్రముఖ 2W, 3W వాహన తయారీ సంస్థ TVS మోటార్ తన ఎంపిక చేసిన బైక్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఇప్పుడు కంపెనీ నియో రెట్రో రోడ్‌స్టర్ డిజైన్ లాంగ్వేజ్‌తో కూడిన TVS రోనిన్ 225 బైక్ ధరలో పెద్ద కోత పెట్టింది. ఇంతకుముందు రైడర్ 125 ధరలో కంపెనీ రూ.13,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఇప్పుడుTVS రోనిన్ అప్‌టేడ్ ధరలను చూద్దాం.

నివేదిక ప్రకారం.. TVS రోనిన్ ధరలను తగ్గించింది. బేస్ రోనిన్ SS వేరియంట్ ధరలు ఇప్పుడు రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. రోనిన్ SS ఇప్పుడు రూ. 15,000 (ఎక్స్-షోరూమ్) తగ్గింది. బేస్ రోనిన్ ఎస్ఎస్, రోనిన్ డిఎస్ మధ్య ధర వ్యత్యాసం రూ.7,500. ధరల మార్పు తర్వాత ఇప్పుడు రోనిన్ SS, రోనిన్ DS రూ. 21,700 తగ్గాయి. రోనిన్ SS నుండి రోనిన్ DSకి రూ. 21,700 (ఎక్స్-షోరూమ్) అప్‌గ్రేడ్ ఇప్పటికీ డ్యూయల్ ఛానల్ ABS పొందలేదు. దీని కోసం రోనిన్ టిడిని ఎంచుకోవాలి. కొత్త ధరతో TVS రోనిన్ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350ని టార్గెట్ చేస్తుంది.

బేస్ వేరియంట్ ధర మినహా TVS రోనిన్‌లో ఎటువంటి మార్పు లేదు. ఈ బైక్‌లో గోల్డెన్ USD టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, 7 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ రియర్ మోనో షాక్, ట్యూబ్‌లెస్ టైర్‌లతో కూడిన 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, 2,040mm వీల్‌బేస్, LED హెడ్‌లైట్‌లతో కూడిన T సైజ్ హెడ్‌లైట్లు LED DRL, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉన్నాయి. ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

TVS రోనిన్ 225.9cc SOHC 4V ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో రన్ అవుతుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 20.4 PS పీక్ పవర్, 19.93 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. డ్యూయల్ ఛానల్ ABS వంటి కొన్ని ప్రత్యేక మోడళ్లను మినహాయించి TVS రోనిన్ SS రూ. 1.35 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర విభాగంలో RE హంటర్ 350తో సహా అనేక బైక్‌లతో పోటీపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories