TVS iQube Offers: ఫెస్టివల్ సేల్.. టీవీఎస్ ఐక్యూబ్‌పై ఆఫర్లే ఆఫర్లు, ఫోన్ ధరకే కొనచ్చు!

TVS iQube
x

TVS iQube

Highlights

TVS iQube Offers: టీవీఎస్ ఫెస్టివల్ సేల్‌లో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది.

TVS iQube Offers: TVS మోటార్స్ తన ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ iQubeపై పండుగ ఆఫర్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కంపెనీ ఆఫర్లను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ వేరియంట్, రాష్ట్రాన్ని బట్టి మారుతుందని కంపెనీ చెబుతోంది. ఈ పండుగ సీజన్ ఆఫర్‌లు కొత్త iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనాలనుకొనే వారికి డీల్‌ను మరింత మెరుగ్గా చేస్తాయి. గత నెలలో iQub రెండవ స్థానం నుండి మూడవ స్థానానికి చేరుకుంది. కాగా బజాజ్ నంబర్-2 స్థానానికి చేరుకుంది. ఇది ఏతర్ రిజ్టా, బజాజ్ చేతక్, Ola S1స్కూటర్లతో పోటీపడుతుంది.

iQube 2.2kWh బ్యాటరీ ప్యాక్‌ మోడల్‌పై కంపెనీ రూ.17,300 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. కొన్ని బ్యాంక్ కార్డ్‌లపై రూ. 7,700 అదనపు క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో 3.4kWh బ్యాటరీ ప్యాక్‌పై రూ. 20,000 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. నిర్దిష్ట బ్యాంకు కార్డులను స్వైప్ చేయడం ద్వారా రూ. 10,000 అదనంగా ఆదా చేయవచ్చు. iQube Sపై కంపెనీ ఫ్రీ వారంటీని కూడా అందిస్తోంది.

TVS iQube Features
TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ 7 అంగుళాల TFT టచ్‌స్క్రీన్, క్లీన్ UI, ఇన్ఫినిటీ థీమ్ పర్సనలైజేషన్, వాయిస్ అసిస్ట్, Alexa Skillset, Intuitive Music Player Control, OTA అప్‌డేట్‌లు, ప్లగ్-అండ్-ప్లే విత్ ఛార్జర్ ఫాస్ట్ ఛార్జింగ్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్, బ్లూటూత్ వంటి ఫీచర్లు కనెక్టివిటీ ఎంపికలు, 32 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంది.

ఇందులో 5.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 140 కిమీ. TVS iQube 5 వే జాయ్‌స్టిక్ ఇంటరాక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, వెహికల్ హెల్త్‌తో ప్రోయాక్టివ్ నోటిఫికేషన్‌లు, 4G టెలిమాటిక్స్, OTA అప్‌డేట్‌లను పొందుతుంది. స్కూటర్ థీమ్ పర్సనలైజ్డ్, వాయిస్ అసిస్ట్, అలెక్సాతో వస్తుంది. ఇది 1.5kW ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని SmartConnect ప్లాట్‌ఫారమ్ మెరుగైన నావిగేషన్ సిస్టమ్, టెలిమాటిక్స్ యూనిట్, యాంటీ-థెఫ్ట్, జియోఫెన్సింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories