Toyota Innova Sales: టయోటా ఇన్నోవా.. రెండేళ్లలో లక్ష ఇళ్లకు చేరింది..!

Toyota Sold 9700 Units of Innova and HiCross Models In December 2024
x

Toyota Innova Sales: టయోటా ఇన్నోవా.. రెండేళ్లలో లక్ష ఇళ్లకు చేరింది..!

Highlights

Toyota Innova Sales: టయోటా ఇన్నోవా అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో ఎమ్‌పివి ఒకటి.

Toyota Innova Sales: టయోటా ఇన్నోవా అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో ఎమ్‌పివి ఒకటి. టయోటా ఇన్నోవా మిలియన్ల కిలోమీటర్లు ప్రయాణించినా ఇంజన్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.అలాగే టయోటా ఇన్నోవా మంచి ఫ్యామిలీ కారు. తర్వాత వచ్చిన ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి కూడా బాగా అమ్ముడవుతోంది. దీని తర్వాత మోడల్ హైక్రాస్. ఇన్నోవా హైక్రాస్ కూడా భారీగా అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.

టయోటా కంపెనీ గత నెల విక్రయాల నివేదికను వెల్లడించింది. డిసెంబర్ 2024 నెలలో 9,700 యూనిట్ల టొయోటా ఇన్నోవా , హిక్రాస్ మోడళ్లు అమ్ముడయ్యాయి. ఇదే 2023 డిసెంబర్ లో కేవలం 7,832 యూనిట్ల టొయోటా ఇన్నోవా, హిక్రాస్ మోడల్‌లు విక్రయించారు. గత విక్రయాలతో పోలిస్తే 24 శాతం వృద్ధి కన్పించింది.

కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివి నవంబర్ 2022లో విడుదలైంది. అప్పటి నుంచి నేటి వరకు పెద్ద సంఖ్యలో కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేస్తున్నారు. ఇన్నోవా హైక్రాస్ రెండేళ్లలోపు 1 లక్ష యూనిట్లకు పైగా కార్లను విక్రయించి ప్రధాన మైలురాయిని సాధించింది.

టయోటా ఇన్నోవా హైక్రాస్ మోడల్ GX, GX(O), VX, VX(O), ZX,ZX(O) వేరియంట్లలో అందుబాటులో ఉంది. సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్ అండ్ యాటిట్యూడ్ బ్లాక్ మైకాతో సహా వివిధ కలర్ ఆప్షన్లలో ఉంది. ఈ ఎమ్‌పివిలో రెండు పవర్‌ట్రెయిన్లు ఉన్నాయి.

దీని 2-లీటర్ హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) ఇంజన్ 186 పిఎస్ పవర్ రిలీజ్ చేస్తుంది. E-CVT గేర్‌బాక్స్ ఆప్షనల్. మరో 2-లీటర్ నాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 175 పిఎస్ పవర్, 209 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో సివిటి గేర్‌బాక్స్ ఉంది.

కొత్త ఇన్నోవా దాని సేఫ్టీ ఫీచర్లకు కూడా ప్రసిద్ధి చెందింది. ప్రయాణీకుల రక్షణ కోసం ఇందులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, VSC (వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ఫ్రంట్-రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి ప్రస్తుతం G, GX, GX+, VX ,ZX వేరియంట్లలో విక్రయిస్తున్నారు. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 లీటర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 147.9 బిహెచ్‌పి పవర్, 343 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిలో ఎకో,పవర్ అనే రెండు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories