Top 5 Selling Cars: ఈ ఐదు కార్లకు తిరుగులేదు.. జనాలు ఎగబడి కొంటున్నారు

Top 5 Selling Cars: ఈ ఐదు కార్లకు తిరుగులేదు.. జనాలు ఎగబడి కొంటున్నారు
x
Highlights

Top 5 Selling Cars: దేశంలో ప్రతి నెలా పెద్ద సంఖ్యలో ప్రజలు కార్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే 2024 సంవత్సరం చివరి నెలలో కూడా...

Top 5 Selling Cars: దేశంలో ప్రతి నెలా పెద్ద సంఖ్యలో ప్రజలు కార్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే 2024 సంవత్సరం చివరి నెలలో కూడా వినియోగదారులకు ఆటోమొబైల్ కంపెనీలు భారీ తగ్గింపు ఆఫర్‌లు అందించాయి. దీన్ని సద్వినియోగం చేసుకుని లక్షల్లో కార్లను కొనుగోలు చేశారు. టాప్-5 కార్ల మొత్తం విక్రయాలు 82341 యూనిట్లుగా ఉన్నాయి.

నివేదికల ప్రకారం డిసెంబర్ 2024లో అత్యధిక డిమాండ్‌ను చూసిన కారు మారుతి బ్రెజ్జా. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో వస్తున్న ఈ వాహనం గత నెలలో 17336 యూనిట్లను విక్రయించింది. ఏడాది ప్రాతిపదికన దీని విక్రయాలు 25 శాతం పెరిగాయి. దీని 12844 యూనిట్లు డిసెంబర్ 2023లో విక్రయించారు.

మారుతీ కారు కూడా టాప్-5 కార్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మారుతి వ్యాగన్ ఆర్ కూడా గత నెలలో పెద్ద సంఖ్యలో అమ్ముడయ్యాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ వాహనం మొత్తం అమ్మకాలు 17303 యూనిట్లుగా ఉన్నాయి. డిసెంబర్ 2023లో 8578 యూనిట్లు విక్రయించారు. ఏడాది ప్రాతిపదికన దీని విక్రయాలు 102 శాతం పెరిగాయి.

మారుతి డిజైర్‌ను కాంపాక్ట్ సెడాన్‌గా మారుతి విక్రయిస్తోంది. కంపెనీ ఈ వాహనం న్యూ జనరేషన్ మోడల్ కారును నవంబర్ 2024లో మాత్రమే విడుదల చేసింది. కానీ లైక్ చేసే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు. సమాచారం ప్రకారం.. డిసెంబర్ 2024 లో 16573 యూనిట్లు విక్రయించారు. డిసెంబర్ 2023లో 14012 యూనిట్లు అమ్ముడయ్యాయి.

డిసెంబర్ 2024లో మారుతి అందించిన MPV మారుతి ఎర్టిగా కూడా ప్రజలు బాగా ఇష్టపడ్డారు. గత నెలలో ఈ వాహనం 16056 యూనిట్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్ 2023లో ఈ సంఖ్య 12975 యూనిట్లుగా ఉంది.

టాటా మోటార్స్ చౌకైన ఎస్‌యూవీగా అందిస్తున్న టాటా పంచ్‌ను కూడా ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ SUV డిసెంబర్ 2024లో 15073 యూనిట్లను విక్రయించింది. డిసెంబర్ 2023లో దేశవ్యాప్తంగా 13787 యూనిట్లు సేల్ అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories