Top Selling Car: ఈ ఏడాది దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు ఏంటో తెలుసా.?

Top 10 Selling Cars in the Year of 2024
x

Top Selling Car: ఈ ఏడాది దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు ఏంటో తెలుసా.?

Highlights

Top Selling Car: ప్రతీ ఏటా దేశంలో ఎన్నో కొత్త కార్లు లాంచ్‌ అవుతుంటాయి. అమ్మకాలు జరుపుకుంటాయి. అయితే కేవలం కొన్ని కార్లు మాత్రమే అత్యధికంగా అమ్ముడవుతుంటాయి.

Top Selling Car: ప్రతీ ఏటా దేశంలో ఎన్నో కొత్త కార్లు లాంచ్‌ అవుతుంటాయి. అమ్మకాలు జరుపుకుంటాయి. అయితే కేవలం కొన్ని కార్లు మాత్రమే అత్యధికంగా అమ్ముడవుతుంటాయి. వినియోగదారులు ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. మరి 2024 ఏడాది ముగుస్తున్న తరుణంలో ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడుపోయిన కారు ఏంటి.? దానిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏడాది భారత్‌లో ఎక్కువగా అమ్ముడు పోయిన కార్ల జాబితాలో టాటీ పంచ్‌ ఉంది. ఈ ఏడాది ఏకంగా 1.86 లక్షల విక్రయాలతో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది కూడా టాటా పంచ్‌ అమ్మకాలు ఓ రేంజ్‌లో జరిగాయి. 2023లో టాటా పంచ్‌ ఏకంగా 1.5 లక్షల కార్ల విక్రయాలు జరిగాయి. టాటా పంచ్‌కు సేఫ్టీ విషయంలో 5 స్టార్‌ రేటింగ్ ఉండడం మంచి ఫీచర్లు ఉండడంతో టాప్‌లో నిలిచింది.

ఇక ఈ కారు ధర విషయానికొస్తే టాటా పంచ్‌ ప్రారంభ వేరియంట్‌ రూ. 6.13 లక్షల నుంచి మొదలై రూ. 10.15 లక్షల మధ్య ఉంది. అదే సమయంలో టాటా పంచ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.23 లక్షల వరకు ఉంది. మైలేజ్‌ విషయంలో కూడా టాటా పంచ్‌ ఇతర కార్లకు మంచి పోటీనిస్తోంది. పెట్రోల్‌ మ్యానువల్‌ వేరియంట్‌ లీటర్‌కు 17 కి.మీలు, సీఎన్‌జీ మ్యానువల్‌ కేజీకి 17.43 కిలోమీటర్లు, అలాగే పెట్రోల్‌ ఆటోమెటిక్‌ వేరియంట్ లీటర్‌కు 16.5 కి.మీలు అందిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ ఏడాది టాప్‌ 10 జాబితాలో నిలిచిన ఇతర కార్లు వివరాలు చూస్తే.. హ్యుందాయ్ క్రెటా (1,74,311), మారుతి సుజుకి బ్రీజా (1,70,824), మహీంద్రా స్కార్పియ (1,54,169), టాటా నెక్సాన్ (1,48,075), మారుతి సుజుకి ఫ్రాంక్స్ (1,45,484), మారుతి సుజుకి గ్రాండ్ విటారా (1,15,654), హ్యుందాయ్ వెన్యూ (1,07,554), కియా సోనెట్ (1,03,353), మహీంద్రా బొలెరో (91,063) ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories