How To Check Petrol Quality: పెట్రోల్ క్వాలిటీ.. ఇది తెలియకపోతే మీ బండ్లు గుల్ల గుల్లే..!

How To Check Petrol Quality
x

How To Check Petrol Quality

Highlights

How To Check Petrol Quality: ఈ మార్గాలు ద్వారా మీరు పెట్రోల్ నాణ్యతను సెకన్లలో కనుగొచ్చు.

How To Check Petrol Quality: ఇప్పుడు దేశంలోని ప్రతి నగరంలో పెట్రోల్ పంపుల సంఖ్య పెరిగింది. ఒక కిలీమీటర్ పరిధిలోనే 3 నుంచి 4 పెట్రోల్ పంపులు కనిపిస్తాయి. పలు పెట్రోల్ పంపుల్లో ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ నాణ్యతపై కూడా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా సార్లు పెట్రోల్ కల్తీ అయిన వార్తలు వినే ఉంటాము. అటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ నాణ్యత విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కొన్ని మార్గాలు ద్వారా మీరు పెట్రోల్ నాణ్యతను సెకన్లలో కనుగొనవచ్చు.

మన వాహనం సరైన నాణ్యత గల పెట్రోల్‌ను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే కల్తీ పెట్రోల్ వినియోగించడం వల్ల చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొవలసి ఉంటుంది. వెహికల్ ఇంజన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలానే ఇతర భాగాలు కూడా పాడవచ్చు. ఈ పొరపాటు మన జేబులకు కూడా భారంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఎల్లప్పుడూ నమ్మకమైన పంపు నుండి మాత్రమే పెట్రోల్ నింపండి.

ఫిల్టర్ పేపర్ లేదా A4 పేపర్‌తో తనిఖీ చేయండి
పెట్రోల్ నాణ్యతను తనిఖీ చేయడానికి సులభమైన, చౌకైన మార్గం ఫిల్టర్ పేపర్. దీని వినియోగంతో పెట్రోల్‌లో ఎలాంటి కల్తీ జరిగినా సులభంగా గుర్తించవచ్చు. పెట్రోల్ స్వచ్ఛతను తనిఖీ చేయడానికి ఫిల్టర్ పేపర్‌పై కొన్ని చుక్కల పెట్రోల్‌ను వేయండి. ఫిల్టర్ పేపర్‌పై మరక పడితే పెట్రోల్ కల్తీ అవుతుంది. స్మడ్జ్‌లు ఏర్పడకపోతే పెట్రోల్ నాణ్యత బాగుంటుంది. మీకు ఫిల్టర్ పేపర్ లేకపోతే మీరు దానిని తెల్లటి A4 కాగితంతో కూడా చెక్ చేయవచ్చు. A4 పేపర్ ధర రూ.1 మాత్రమే. అదే సమయంలో ఫిల్టర్ పేపర్ ధర కూడా రూ.10 లోపే ఉంది. ఈ పని కోసం మీకు కొద్దిగా ఫిల్టర్ పేపర్ మాత్రమే అవసరం.

పెట్రోల్ డెన్సిటీ
స్వచ్ఛమైన పెట్రోల్ సాంద్రత 730 నుంచి 800 మధ్య ఉండాలని భారత్ పెట్రోలియం నిర్ణయించింది. పెట్రోలు సాంద్రత 800 కంటే ఎక్కువగా ఉంటే పెట్రోల్‌లో కల్తీ జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే దీని సాంద్రత ప్రయోగశాలలో మాత్రమే పరీక్షించాల్సి ఉంటుంది. దీని కోసం కొన్ని ప్రత్యేకమైన పరికరాలు అవసరం. దీనికి హైడ్రోమీటర్, ప్రత్యేక థర్మామీటర్, కొన్ని ఇతర పరికరాలు అవసరం. వీటిని ఉపయోగించడం ద్వారా పెట్రోల్ స్వచ్ఛతను తెలుసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories