High Mileage Cars: నమ్మండి బ్రో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు.. ధర కూడా తక్కువేగా..!

High Mileage Cars
x

High Mileage Cars

Highlights

High Mileage Cars: ఈ కార్లు సిటీ, హైవే రైడింగ్‌లో ఎక్కువ మైలేజ్‌ని అందిస్తున్నాయి. వీటి పర్ఫామెన్స్ కూడా పీక్‌లో ఉంటుంది. తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు.

High Mileage Cars: దేశంలో కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఎక్కువ మంది ప్రజలు తమకు సొంత కారు ఉండాలని కోరుకుంటున్నారు. అయితే కారు కొనాలంటే మొదటగా ప్రతి ఒక్కరు చూసేది మైలేజ్. దీనితో పాటు కారు లుక్, ఫీచర్స్, ఇంజన్ సామర్థ్యం. ఆటో మార్కెట్‌లో ఎప్పుడూ మైలేజీ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. సిటీ, హైవేపై ఎక్కువగా డ్రైవింగ్ చేసే వారికి పెట్రోల్ కారు అవసరం. ఇది మెరుగైన పనితీరును మాత్రమే కాకుండా మంచి మైలేజీని కూడా అందిస్తుంది. మైలేజ్ ఇచ్చే కార్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే అనేక బెస్ట్ కార్లు ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Maruti Suzuki Dzire
మారుతి సుజు కాంపాక్ట్ సెడాన్ కారు డిజైర్ సిటీ, హైవే‌లో బలమైన పనితీరును అందిస్తుంది. దీని డిజైన్ దీనిని ఖచ్చితమైన కాంపాక్ట్ SUVగా చేస్తుంది. డిజైర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌‌తో వస్తుంది. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 22.41kmpl మైలేజీని అందిస్తుంది. అయితే AMTతో 22.61kmpl మైలేజీని అందిస్తుంది. మారుతి డిజైర్ అత్యధిక మైలేజ్ ఇచ్చే కాంపాక్ట్ సెడాన్ కారు. ఇందులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం ఈ కారులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 2 ఎయిర్‌బ్యాగ్‌లు, డిస్క్ బ్రేక్, 3 పాయింట్ సీటర్ బెల్ట్ సౌకర్యం ఉంది. కారు ధర రూ.6.56 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Maruti Suzuki Celerio
మీరు మంచి మైలేజీని అందించే చిన్న కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మారుతి సుజుకి సెలెరియో మీకు మంచి ఎంపికగా ఉంటుంది. సెలెరియో డిజైన్, ఇంటీరియర్ చాలా బాగుంటుంది. ఈ కారులో 1.0L పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది. అత్యధిక మైలేజీని ఇచ్చే పెట్రోల్ కారు ఇది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 25.24 kmpl, AMT వేరియంట్ 26.68 kmpl బలమైన మైలేజీని ఇస్తుంది. దీని అధిక మైలేజీకి కారణం దీని డ్యూయల్ జెట్ ఇంజన్. సెలెరియో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.45 లక్షలు.

Honda City
హోండా సిటీ 5వ జనరేషన్ ప్రీమియం సెడాన్ కారు మాత్రమే కాదు, దీని పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇది 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఈ కారు ఒక లీటర్‌లో 24.1 kmpl మైలేజీని అందిస్తుంది. ఇందులో స్పేస్ చాలా బాగుంటుంది. బూట్‌ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, అనేక అధునాతన, లగ్జరీ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories