Senior Citizens Best Cars: సీనియర్‌ సిటిజన్లకి బెస్ట్‌ కార్లు.. ధర తక్కువ ఇంకా ఆటోమేటిక్‌ గేర్‌ సిస్టమ్‌..!

These Cars are Best for Senior Citizens Small in Size With Automatic Gear System
x

Senior Citizens Best Cars: సీనియర్‌ సిటిజన్లకి బెస్ట్‌ కార్లు.. ధర తక్కువ ఇంకా ఆటోమేటిక్‌ గేర్‌ సిస్టమ్‌..!

Highlights

Senior Citizens Best Cars: సీనియర్‌ సిటిజన్లు కొన్నికార్లని నడపడానికి చాలా ఇబ్బంది పడుతారు.

Senior Citizens Best Cars: సీనియర్‌ సిటిజన్లు కొన్నికార్లని నడపడానికి చాలా ఇబ్బంది పడుతారు. ఎందుకంటే అవి వారికి అనుకూలంగా ఉండవు. చాలామంది కారు కొనేటప్పుడు వారి అభిరుచులకి అనుగుణంగా కొనుగోలు చేస్తారు. కొందరికి కారు ధర ముఖ్యమైతే మరి కొందరికి మైలేజీ ముఖ్యం. ఇంకొందరికి కారు భద్రతా ఫీచర్లు ముఖ్యమైనవి. సీనియర్ సిటిజన్లకి మాత్రం కారు డ్రైవింగ్‌ చేయడంలో అనుకూలత, సౌకర్యం, భద్రత ముఖ్యం. చాలా తేలికగా నడపగలిగే కార్లను కొనడానికి ఇష్టపడతారు. అలాంటి కొన్నికార్ల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఈ రెండు కార్లు

సీనియర్ సిటిజన్ల కోసం మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఈ రెండు కార్ల పరిమాణం కొంచెం తక్కువగా ఉంటుంది. తక్కువ ధరలో లభిస్తాయి. వృద్ధులు ఆటోమేటిక్ గేర్, పవర్ స్టీరింగ్, సులభంగా ఆపరేట్ చేయగల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఇష్టపడతారు. కారులో ABS, ఎయిర్‌బ్యాగ్‌లు, క్రాష్ వార్నింగ్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లని కోరుకుంటారు. ఇవన్ని ఈ రెండు కార్లలో ఉంటాయి.

ఆటోమేటిక్ వేరియంట్‌

ఈ రెండు కార్లు సీనియర్ సిటిజన్ల అవసరాలకు అనుగుణంగా ఫీచర్లని పొందుపరిచారు. కొన్ని వేరియంట్‌లు ఆటోమేటిక్‌గా ఉంటాయి. కాబట్టి కారు నడపడం చాలా సులభం అవుతుంది. పవర్ స్టీరింగ్, పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్స్‌ని అందించారు. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వివిధ రకాల రోడ్లపై నడపడానికి అనుకూలంగా ఉంటాయి.

కార్ల ధర

అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెండు కార్లు ABS, ఎయిర్‌బ్యాగ్‌ల వంటి భద్రతా ఫీచర్లని పొందాయి. మంచి మైలేజీ, నమ్మదగిన సర్వీస్ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుంది. మారుతి స్విఫ్ట్ ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.45 లక్షలు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఆటోమేటిక్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.28 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories