Top 10 Best Selling Cars: భారతీయులు మోజుపడి కొంటున్నకార్లు ఇవే.. ఎందుకో తెలుసా..?

Top 10 Best Selling Cars
x

Top 10 Best Selling Cars

Highlights

Top 10 Best Selling Cars: దేశంలో ఎక్కువగా సేల్ అవుతున్న టాప్ 10 ఎస్‌యూవీల్లో టాటా, మారుతీ, మహీంద్రా తదితర కంపెనీల కార్లు ఉన్నాయి.

Top 10 Best Selling Cars: దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ఇవి ఇండస్ట్రీలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అంతేకాకుండా టాప్ ఫీచర్లతో అందుబాటు ధరలో లభిస్తున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ నుండి జూలై వరకు టాప్ 10 ఎస్‌యూవీల జాబితాను చూస్తే 2 మోడల్స్ మాత్రమే వార్షిక క్షీణతను ఎదుర్కోవలసి వచ్చింది. ఇతర 8 మోడళ్లకు భారీగా సేల్స్ నమోదు చేశాయి. ఈ జాబితాలో నంబర్ 1లో ఉన్న టాటా పంచ్ వార్షిక వృద్ధి 61 శాతం ఉండగా, మహీంద్రా XUV3XO 64 శాతం వార్షిక వృద్ధిని పొందాయి. అదే సమయంలో ఈ 4 నెలల్లో, పంచ్ 72,466 యూనిట్లతో నంబర్ 1 స్థానంలో కొనసాగింది. వీటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

SUV విభాగంలో ఏప్రిల్ నుండి జూలై 2024 వరకు అమ్మకాల గురించి మాట్లాడితే టాటా పంచ్ 72,466 యూనిట్లు సేల్ చేసింది. 2023లో ఇదే కాలంలో ఈ సంఖ్య 45,067 యూనిట్లుగా ఉంది. అంటే 61 శాతం వార్షిక వృద్ధిని పొందింది. ఈ కాలంలో హ్యుందాయ్ క్రెటా 63,752 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో ఇదే కాలంలో ఈ సంఖ్య 57,144 యూనిట్లుగా ఉంది. అంటే 12 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. ఈ సమయంలో మారుతి బ్రెజ్జా 59,147 యూనిట్లు విక్రయించబడ్డాయి. 2023లో ఇదే కాలంలో ఈ సంఖ్య 52,355 యూనిట్లుగా ఉంది. అంటే 13 శాతం వార్షిక వృద్ధిని పొందింది.

ఈ సమయంలో మహీంద్రా స్కార్పియో 53,068 యూనిట్లు అమ్మెడయ్యాయి. 2023లో ఇదే కాలంలో ఈ సంఖ్య 38,105 యూనిట్లుగా ఉంది. అంటే 39 శాతం వార్షిక వృద్ధిని పొందింది. ఇదే టైమ్‌లో టాటా నెక్సాన్ 48,593 యూనిట్లు విక్రయించబడ్డాయి. 2023లో ఇదే కాలంలో ఈ సంఖ్య 55,601 యూనిట్లుగా ఉంది. అంటే అది 13 శాతం వార్షిక క్షీణతను నమోదు చేసింది. ఈ కాలంలో మారుతీ ఫ్రంట్ 47,580 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో ఇదే కాలంలో ఈ సంఖ్య 39,858 యూనిట్లుగా ఉంది. అంటే 19 శాతం వార్షిక వృద్ధిని పొందింది. ఈ కాలంలో హ్యుందాయ్ వెన్యూ 37,177 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో ఇదే కాలంలో ఈ సంఖ్య 42,223 యూనిట్లుగా ఉంది. అంటే 12 శాతం వార్షిక అమ్మకాలు క్షీణించాయి.

ఈ కాలంలో మారుతి గ్రాండ్ విటారా 36,463 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో ఇదే కాలంలో ఈ సంఖ్య 36,184 యూనిట్లుగా ఉంది. అంటే 1 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. ఈ సమయంలో కియా సోనెట్ 34,609 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో ఇదే కాలంలో ఈ సంఖ్య 29,962 యూనిట్లుగా ఉంది. అంటే 16 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. ఈ కాలంలో మహీంద్రా XUV3XO 32,501 యూనిట్లు విక్రయించబడ్డాయి. 2023లో ఇదే కాలంలో ఈ సంఖ్య 19,814 యూనిట్లుగా ఉంది. అంటే 64 శాతం వార్షిక వృద్ధిని సొంతం చేసుకుంది. ఈ విధంగా ఈ 10 మోడళ్లలో మొత్తం 4,85,356 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో ఈ సంఖ్య 4,16,313 యూనిట్లుగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories