Tata Punch EV: వచ్చేనెలలో రానున్న టాటా పంచ్ చౌకైన ఎలక్ట్రిక్ కార్.. ఫుల్ ఛార్జ్‌తో 350 కిమీలు.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Tata Punch EV Launch Date, Features And Booking Details in Telugu
x

Tata Punch EV: వచ్చేనెలలో రానున్న టాటా పంచ్ చౌకైన ఎలక్ట్రిక్ కార్.. ఫుల్ ఛార్జ్‌తో 350 కిమీలు.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Highlights

Tata Punch EV: టాటా మోటార్స్ వచ్చే నెల జనవరి 2024 చివరి వారంలో పంచ్ EV (Punch.ev)ని ప్రారంభించవచ్చు.

Tata Punch EV: టాటా మోటార్స్ వచ్చే నెల జనవరి 2024 చివరి వారంలో పంచ్ EV (Punch.ev)ని ప్రారంభించవచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సమాచారాన్ని అందించింది. అయితే, కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం పక్రటించలేదు.

నివేదిక ప్రకారం, పంచ్ EV దేశంలో చౌకైన పూర్తి ఎలక్ట్రిక్ SUV కావచ్చు. ఇది సిట్రోయెన్ eC3తో పోటీపడుతుంది. దీని ధర ₹11.61 లక్షల నుంచి మొదలై ₹12.79 లక్షల వరకు ఉంటుంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్.

350 కిమీ మైలేజీ..

టాటా పంచ్ EV స్పెసిఫికేషన్‌ల గురించి ఇంకా సమాచారం అందుబాటులో లేదు. కంపెనీ ఇందులో 24kWh కంటే పెద్ద బ్యాటరీని అందించగలదని భావిస్తున్నారు. పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు, పంచ్ EV బ్యాటరీ 350 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

ICE పంచ్‌తో పోలిస్తే EVలో మరిన్ని ఫీచర్లు..

మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ ICE పంచ్‌తో పోలిస్తే పంచ్ EVలో మరిన్ని ఫీచర్లను అందించగలదు. ఇందులో LED హెడ్‌లైట్లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్పోక్ స్టీరింగ్ వీల్, స్పోక్ స్టీరింగ్ వీల్ ఇలాంటి మరెన్నో ఫీచర్లు అందించవచ్చని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories