Tata Nexon CNG: మారుతి బ్రెజ్జాకు చెక్ పెట్టనున్న టాటా నెక్సాన్.. సీఎన్‌జీ వెర్షన్ విడుదల ఎప్పుడంటే?

tata nexon cng may launch this year check price and features
x

Tata Nexon CNG: మారుతీ బ్రెజ్జాకు చెక్ పెట్టనున్న టాటా నెక్సాన్.. సీఎన్‌జీ వెర్షన్ విడుదల ఎప్పుడంటే?

Highlights

Nexon CNGలో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. భారతదేశంలో విక్రయించనున్న మొదటి టర్బో-పెట్రోల్ CNG వాహనం ఇది.

Tata Nexon CNG: టాటా మోటార్స్ నెక్సాన్ సీఎన్‌జీని భారత్ మొబిలిటీ షో 2024 సందర్భంగా ప్రదర్శించింది. ఇప్పుడు ఈ ప్రసిద్ధ కాంపాక్ట్ SUV CNG వెర్షన్ రాబోయే నెలల్లో భారతదేశంలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. మారుతి సుజుకి బ్రెజ్జా CNGతో పోటీపడుతుంది.

Nexon CNGలో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. భారతదేశంలో విక్రయించనున్న మొదటి టర్బో-పెట్రోల్ CNG వాహనం ఇది. పెట్రోల్ మోడ్‌లో, ఈ ఇంజన్ 118bhp శక్తిని, 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG మోడ్‌లో, ఇది కొంచెం తక్కువ శక్తిని, టార్క్‌ను అందిస్తుంది. అయితే, దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం ప్రస్తుతానికి వెల్లడి కాలేదు.

మరోవైపు, మారుతి సుజుకి బ్రెజ్జా CNG 1.5-లీటర్ K15C పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది ఫ్యాక్టరీకి అమర్చిన, సింగిల్-సిలిండర్ CNG కిట్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసింది. ఇది 87bhp శక్తిని, 121Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, Nexon ట్విన్-సిలిండర్ CNG సెటప్‌ను కలిగి ఉంది. ఇది చాలా మెరుగైనది. ఎక్కువ బూట్ స్పేస్‌ను అందిస్తుంది. ఈ సెటప్ 60 లీటర్ల గ్యాస్‌ను కలిగి ఉంటుంది. 230-లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగిఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories