New Tata Sumo 2025: మళ్లీ వచ్చేస్తున్న టాటా సుమో.. లుక్ చూస్తే ఆశ్చర్యపోతారు..!

Tata Motors to Unveil New Avatar of Sumo at Bharat Auto Expo 2025
x

New Tata Sumo 2025: మళ్లీ వచ్చేస్తున్న టాటా సుమో.. లుక్ చూస్తే ఆశ్చర్యపోతారు..!

Highlights

New Tata Sumo 2025: ఈసారి భారతదేశంలో జరిగే ఆటో ఎక్స్‌పో 2025లో అనేక కొత్త కార్లు విడుదల కానున్నాయి.

New Tata Sumo 2025: ఈసారి భారతదేశంలో జరిగే ఆటో ఎక్స్‌పో 2025లో అనేక కొత్త కార్లు విడుదల కానున్నాయి. చాలా పాత మోడల్స్ కూడా అప్‌గ్రేడ్‌గా వస్తున్నాయి. ఇప్పుడు టాటా మోటర్స్ తన సుమో కొత్త అవతార్‌లో పరిచయం చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. కొత్త సుమో రాకతో టాటా కలెక్షన్స్‌లో మరో కొత్త కారు చేరుతుంది. ఇది మాత్రమే కాదు, మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 కొత్త సుమో నుండి గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. టాటా సుమో ఆ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన, విజయవంతమైన ఎస్‌యూవీ. కొత్త సుమో గురించి టాటా మోటార్స్ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.

ఈసారి కొత్త టాటా సుమో డిజైన్‌లో చాలా పెద్ద మార్పులను చూడచ్చు. డిజైన్ నుండి అనేక అధునాతన వాటిని ఇందులో చూడచ్చు. సఫారీ, హారియర్ వంటి కొత్త మోడల్‌లో చూడచ్చని నమ్ముతారు. కానీ ఇది చాలా ఎక్కువ ప్రీమియం కాదు. కంపెనీ ఈ వాహనాన్ని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో మాత్రమే ఆవిష్కరిస్తుంది. కానీ వినియోగదారులు లాంచ్ కోసం కొంచెం వేచి ఉండాల్సి ఉంటుంది.

కొత్త సుమో ముందు భాగంలో బోల్డ్ ఫ్రంట్ గ్రిల్‌తో పాటు డిఆర్ఎల్‌తో కూడిన కొత్త LED హెడ్‌లైట్‌లను చూడచ్చు. ఇది కాకుండా, 19 లేదా 20 అంగుళాల వీల్స్ ఇందులో కనిపిస్తాయి. సైడ్ ప్రొఫైల్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. అయితే వెనుక ప్రొఫైల్‌లో షార్ప్ LED టెయిల్ లైట్లు ఉంటాయి.

కొత్త సుమోలో ప్రీమియం ఇంటీరియర్‌ను చూవచ్చు. ఇందులో స్పేస్ చాలా బాగుంటుంది. 5 నుంచి 7 మంది వరకు కూర్చునే స్థలం ఉంటుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సౌకర్యవంతమైన అప్హోల్స్టరీ వంటి ఫీచర్లను వాహనంలో ఉంటాయి. భద్రత కోసం 6 ప్లస్ ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన EBD, బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

కొత్త సుమోను పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో తీసుకురావచ్చు. ఇది 2.0లీటర్ ఇంజన్ పొందచ్చు. ఇది కఠినమైన ఎస్‌యూవీ రూపంలో రానుంది. దీన ధర రూ. 12-14 లక్షల వరకు ఉండవచ్చు. కొత్త మోడల్ గురించిన మొత్తం సమాచారాన్ని జనవరి 17-18 తేదీల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories