Tata Upcoming Cars: కార్ లవర్స్.. కాస్త ఆగండి గురూ.. బడ్జెట్ టాటా కార్లు వస్తున్నాయ్

Tata Upcoming Cars: కార్ లవర్స్.. కాస్త ఆగండి గురూ.. బడ్జెట్ టాటా కార్లు వస్తున్నాయ్
x
Highlights

Tata Upcoming Cars: టాటా మోటార్స్ ఈ ఏడాది రూ. 10 లక్షల కంటే తక్కువ ధరతో 3 కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కార్ల ప్రారంభ ధర రూ.5...

Tata Upcoming Cars: టాటా మోటార్స్ ఈ ఏడాది రూ. 10 లక్షల కంటే తక్కువ ధరతో 3 కొత్త కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కార్ల ప్రారంభ ధర రూ.5 నుంచి 6 లక్షల మధ్య ఉంటుంది. ఈ జాబితాలో ఫేస్‌లిఫ్టెడ్ టాటా పంచ్, టియాగో, టిగోర్ పేర్లు ఉన్నాయి. ఇవి కంపెనీ అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు. సమాచారం ప్రకారం.. జనవరి 17 నుండి ప్రారంభమయ్యే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాటా టియాగో, టిగోర్‌లను ఆవిష్కరించవచ్చు. కారు సాధ్యమైన ధర, ఫీచర్లు తెలుసుకుందాం.

Tata Punch - టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్

టాటా మోటార్స్ ఈ సంవత్సరం కొత్త అవతార్‌లో పంచ్‌ను విడుదల చేయనుంది. ఇది మైక్రో SUV అవుతుంది. ఇందులో ఎలక్ట్రిక్-లాంటి డిజైన్ చూడవచ్చు. అప్‌గ్రేడ్ చేసిన గ్రిల్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED DRL కొత్త పంచ్‌లో ఇవ్వవచ్చు. ఈ కొత్త SUVలో మీరు చాలా గొప్ప ఫీచర్లను పొందవచ్చని భావిస్తున్నారు.

ఈ కారు వైర్‌లెస్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లను పొందబోతోంది. అయితే దీని ఇంజన్‌లో ఎలాంటి మార్పులు జరగవు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6 లక్షల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Tata Tigor - టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్

టాటా టియాగోతో పాటు, టిగోర్ ఫేస్‌లిఫ్ట్ కూడా ఈ సంవత్సరం లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లతో పాటు అనేక అప్‌డేట్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. టాటా పంచ్ లాగానే ఈ కారు ధర కూడా దాదాపు రూ.6 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.

Tata Tiago - టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్

మూడవ కారు టియాగో ఈ సంవత్సరం విడుదల చేసే అవకాశం ఉంది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో కొన్ని కాస్మోటిక్ మార్పులు కనిపిస్తాయి. ఇందులో మీరు 5-సీట్ల ఎంపికను పొందవచ్చని భావిస్తున్నారు. ఫీచర్లుగా టియాగో ఫేస్‌లిఫ్ట్‌కు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, యుఎస్‌బి టైప్ సి పోర్ట్ , వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ వంటి అనేక ఫీచర్లను అందించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories