Tata Curvv Review: కర్వ్ కొంటున్నారా?.. అయితే కాస్త ఆగండి.. బయటకు వచ్చిన షాకింగ్ నిజాలు..!

Tata Curvv Review
x

Tata Curvv Review

Highlights

Tata Curvv Review: టాటా కర్వ్ ఈవీ ఫుల్ రివ్యూ బయటకు వచ్చింది. 55 kWh బ్యాటరీ ప్యాక్ 389Km రేంజ్ ఇస్తుందని వినియోగదారులు షేర్ చేశారు.

Tata Curvv Review: దేశీయ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ రంగంలో టాటా అగ్రస్థానంలో ఉంటుంది. ఈ కంపెనీ ఇటీవలే టాటా కర్వ్ EVLని విడుదల చసింది. దీని రియల్ రేంజ్ కు సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయి. 45 kWh బ్యాటరీ ప్యాక్‌తో దాని రేంజ్ 502 Km, 55 kWh బ్యాటరీ ప్యాక్‌తో 585 Km అని కంపెనీ పేర్కొంది. దాని 55 kWh బ్యాటరీ ప్యాక్ మోడల్ పూర్తి ఛార్జ్‌తో నడుస్తుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. 55 kWh బ్యాటరీ ప్యాక్ 389Km రేంజ్ ఇస్తుందని వినియోగదారులు షేర్ చేశారు. ఈ క్రమంలో ఈ వెహికల్ ఫుల్ రివ్యూపై ఓ లుక్కేయండి.

ఈ ఎలక్ట్రిక్ SUV ఫుల్ ఛార్జ్ చేసి హైవేపై డ్రైవ్ చేశారు. ఆ సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. అదే సమయంలో, కొంత సామాను కూడా బూట్ స్పేస్‌లో ఉంచారు. ఈ కారు సగటున 85కిమీ/గం వేగంతో నడిచింది. ఇందులో 10 శాతం బ్యాటరీతో సిటీలో డ్రైవ్ చేశారు. మిగిలిన 90 శాతం బ్యాటరీని హైవేపై ఉపయోగించారు. మొత్తం డ్రైవింగ్ సమయంలో AC ఆన్‌లో ఉంది. బ్యాటరీని 95 శాతం వరకు ఉపయోగించినప్పుడు AC ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. అయితే దీని రేంజ్ కంపెనీ క్లెయిమ్‌ చేసిన దానికి వేరుగా ఉంది.

టాటా కర్వ్ EV ఆకర్షణీయమైన బాడీ డిజైన్‌, ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంది. దీనిలో ఎలిజెంట్ LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు ఉన్నాయి. వెనుక వైపున, వెల్‌కమ్, గుడ్‌బై యానిమేషన్‌లతో టెయిల్ ల్యాంప్‌లు కూడా ఉన్నాయి. ఇది క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, స్లోపింగ్ రూఫ్‌లైన్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వీల్ ఆర్చ్‌లపై పియానో ​​బ్లాక్ ఎలిమెంట్‌లను కూడా పొందుతుంది. దీని స్పోర్టీ అప్పీల్ షార్క్ ఫిన్ యాంటెన్నా, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో బెటర్‌గా ఉంటుంది. అయితే ఇది ఏరోడైనమిక్‌గా డిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.

టాటా కర్వ్ EV మొత్తం 5 మోనోటోన్ షేడ్స్‌లో విడుదల చేశారు. వీటిలో ప్రిస్టైన్ వైట్, ఫ్లేమ్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్యూర్ గ్రే, వర్చువల్ సన్‌రైజ్ ఉన్నాయి. వీటిలో మూడు షేడ్స్ Nexon EV నుండి తీసుకోబడ్డాయి. ఫ్యూర్ గ్రే కలర్ కర్వ్‌ని స్పెషల్‌గా చూపిస్తుంది. కర్వ్ EVలో డ్యూయల్-టోన్ ఫినిషింగ్ ఇవ్వలేదు. ఇది స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకాంప్లిష్డ్, ఎంపవర్డ్ అనే 5 ట్రిమ్ స్థాయిలలో విడుదలైంది. కారులో 500 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంటుంది. దీనిని 973 లీటర్ల వరకు పెంచుకోవచ్చు. ఫ్రంట్ ట్రంక్‌లో 35 లీటర్ల స్థలం అందుబాటులో ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 190 మిమీ.

కర్వ్ EVలో చాలా విలాసవంతమైన క్యాబిన్ ఉంది. అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్, కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇది డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, మూడ్ లైటింగ్‌తో కూడిన వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, టచ్ అండ్ టోగుల్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, 4 స్పోక్ స్టీరింగ్ వీల్‌ని కలిగి ఉంది. ఇది హర్మాన్ చేత 12.3-అంగుళాల ఫ్లోటింగ్ సినిమాటిక్ టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే యూనిట్‌ను కూడా కలిగి ఉంది.

సీటింగ్ పరంగా కర్వ్ EV సిక్స్ వే అడ్జస్ట్ చేయగల డ్రైవర్, కో-డ్రైవర్ సీట్లతో వెంటిలేటెడ్ సీట్లను కలిగి ఉంది. ఇందులో 2 పొజిషన్ రియర్ సీట్ రిక్లైనింగ్ ఫంక్షన్ కూడా ఉంది. ఇది ఎకో, సిటీ, స్పోర్ట్ డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. ఆర్కేడ్.EV యాప్ సూట్, V2V ఛార్జింగ్, V2L టెక్నాలజీ, మల్టీ-డయల్ ఫుల్ వ్యూ నావిగేషన్, అడ్వాన్స్‌డ్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (AVAS)వంటి సెగ్మెంట్‌లో ఫస్ట్‌క్లాస్ ఫీచర్లు ఉన్నాయి.

టాటా కర్వ్ EV సేఫ్టీ విషయంలో అత్యధిక ADAS ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, I-VBACతో ESP, డ్రైవర్ డాడ్జ్-ఆఫ్ అలర్ట్‌తో కూడిన లేటెస్ట్ ESP డీసెంట్ కంట్రోల్ అందించబడ్డాయి. ఇది అడ్వాన్స్‌డ్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (AVAS), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌ను కూడా పొందుతుంది.టాటా కర్వ్ EV దాని సెగ్మెంట్‌లో అత్యధిక సంఖ్యలో ADAS ఫీచర్లను అందిస్తోంది.

అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా కర్వ్ EV ఎగ్జాస్ట్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది కారు 20 కి.మీ.కి చేరుకునే వరకు వాకర్స్‌ను అలర్ట్ చేస్తుంది. కర్వ్ EV 5 ట్రిమ్‌ల 7 వేరియంట్‌లలో విడులైంది. దీని ప్రారంభ ధర రూ. 17.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories