2025 Suzuki Gixxer 250: యువతకు పిచ్చెక్కించే బైక్.. అమేజింగ్ లుక్‌తో కొత్త సుజుకి జిక్సర్..!

Suzuki India has Launched the 2025 Gixxer 250 in India
x

2025 Suzuki Gixxer 250: యువతకు పిచ్చెక్కించే బైక్.. అమేజింగ్ లుక్‌తో కొత్త సుజుకి జిక్సర్..!

Highlights

2025 Suzuki Gixxer 250: సుజుకి ఇండియా 2025 Gixxer 250ని భారతదేశంలో విడుదల చేసింది.

2025 Suzuki Gixxer 250: సుజుకి ఇండియా 2025 Gixxer 250ని భారతదేశంలో విడుదల చేసింది. క్వార్టర్-లీటర్ జపనీస్ ఆఫర్ ఇప్పుడు OBD 2 నిబంధనలకు అనుగుణంగా ఉంది. దీని ఇతర ఫీచర్లు పాత మోడల్ లాగానే అలాగే ఉంటాయి. 2025 కోసం సుజుకి Gixxer 250 మునుపటిలాగే కనిపిస్తోంది. ఇది అదే ఫ్లాట్ LED హెడ్‌లైట్, ఫ్యూయల్ ట్యాంక్‌లను కలిగి ఉంది. మీరు సుజుకి Gixxer 250ని 3 కలర్ ఆప్షన్‌లలో కొనచ్చు. వీటిలో మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 2, మెటాలిక్ మాట్ బోర్డియక్స్ రెడ్, పెర్ల్ గ్లేసియర్ వైట్ ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.98 లక్షలు.

ఇంజిన్ గురించి మాట్లాడినట్లయితే దీనికి OB2-కంప్లైంట్ 249సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజన్ మోటార్ 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 26.5బిహెచ్‌పి పవర్, 7,500ఆర్‌పిఎమ్ వద్ద 22.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఫీచర్ల పరంగా, Gixxer 250 స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్-ఛానల్ ABS, LED లైట్‌తో LCDని కూడా పొందుతుంది.

2025 Suzuki Gixxer 250 హార్డ్‌వేర్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్ సెటప్, అల్లాయ్ వీల్స్ మునుపటిలానే అందుబాటులో ఉంటాయి. 2025 సుజుకి Gixxer 250 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,98,000. లాంచ్‌తో కంపెనీ దీని బుకింగ్‌ను ప్రారంభించింది. దీని డెలివరీ కూడా త్వరలో ప్రారంభం కానుంది.

బజాజ్ ఆటో తన కొత్త 2025 పల్సర్ RS200ని విడుదల చేసింది. కంపెనీ కొత్త మోడల్‌లో అనేక ఫీచర్లు, డిజైన్‌లను అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఇది చాలా బెటర్ లుక్ తో వస్తుంది. మీరు ఈ మోటార్‌సైకిల్‌ను 3 కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయగలుగుతారు. ఇందులో గ్లోసీ రేసింగ్ రెడ్, పెరల్ మెటాలిక్ వైట్, యాక్టివ్ శాటిన్ బ్లాక్ ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,84,115గా నిర్ణయించారు. ఇది 200cc ఫ్యూయల్-ఇంజెక్ట్, సింగిల్-స్పార్క్, 4-వాల్వ్ 199.5cc BSVI ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 9750 ఆర్‌పిఎమ్ వద్ద 24.5 పిఎస్ పవర్, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 18.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories