Car Driving Tips: కారులో లాగ్ డ్రైవింగ్‌కి వెళ్తున్నారా ? ఈ పోర్టబుల్ పరికరాన్ని మీ వద్ద ఉంచుకుంటే చాలా సేప్.. లేదంటే?

Summer Car Care tips Always keep Tyre Inflator to Avoid any Problem
x

Car Driving Tips: కారులో లాగ్ డ్రైవింగ్‌కి వెళ్తున్నారా ? ఈ పోర్టబుల్ పరికరాన్ని మీ వద్ద ఉంచుకుంటే చాలా సేప్.. లేదంటే?

Highlights

Summer Car Care: వేసవి కాలం మన శరీరంపైనే కాకుండా వాహనాలపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా వేసవిలో కారులో దూర ప్రయాణాలకు వెళుతుంటే, మీతో ఒక పరికరం ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ పరికరం లేనప్పుడు, మీరు మధ్యలో ఆపివేయవలసి రావచ్చు.

Tyre Inflator: వేసవి కాలం మన శరీరంపైనే కాకుండా వాహనాలపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా వేసవిలో కారులో దూర ప్రయాణాలకు వెళుతుంటే, మీతో ఒక పరికరం ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ పరికరం లేనప్పుడు, మీరు మధ్యలో ఆపివేయవలసి రావచ్చు. లేదా ప్రయాణం అసంపూర్ణంగా ఉంటుంది. ఆ పరికరం పేరు టైర్ ఇన్‌ఫ్లేటర్. దీనితో, మీరు మీ వాహనం టైర్లలో గాలిని నింపవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో టైర్లలో గాలి తరచుగా ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది. ఇది మీ వాహనం ఇంజిన్, టైర్లు రెండింటికి నష్టం జరగకుండా చేస్తుంది. ఈ పోస్ట్‌లో, టైర్ ఇన్‌ఫ్లేటర్ అంటే ఏమిటి, దానిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

టైర్ ఇన్‌ఫ్లేటర్ అంటే ఏమిటి?

టైర్ ఇన్‌ఫ్లేటర్ అనేది వాహనం టైర్‌లో గాలిని నింపడానికి ఉపయోగించే పరికరం. ఇది పోర్టబుల్ పరికరం. ఇది సాధారణంగా 12 వోల్ట్ బ్యాటరీపై నడుస్తుంది. ఈ పరికరం టైర్‌లో నింపిన గాలి ఒత్తిడిని కొలుస్తుంది. తదనుగుణంగా టైర్‌ను గాలితో నింపుతుంది. వేసవి కాలంలో, టైర్లలో గాలి తరచుగా తక్కువగా ఉంటుంది. ఇది కారు ఇంజిన్‌పై ఒత్తిడిని కలిగిస్తుంది. టైర్ ఇన్‌ఫ్లేటర్ ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది. టైర్‌లలో సరైన మొత్తంలో గాలి ఉండేలా చేస్తుంది.

ఈ యంత్రం ప్రయోజనం ఏమిటంటే, టైర్‌లో పంక్చర్ లేదా గాలి పూర్తిగా పోయినట్లయితే, మీరు టైర్ ఇన్‌ఫ్లేటర్ ద్వారా గాలిని నింపడం ద్వారా మెకానిక్‌ దగ్గరకు వెళ్లేంత వరకు పనిచేసేలా చూస్తుంది. విశేషమేమిటంటే మీరు కారులో అందించిన 12V ఛార్జింగ్ సాకెట్ ద్వారా దీనిని ఉపయోగించవచ్చు. కొన్ని ఇన్‌ఫ్లేటర్‌లు తమ సొంత బ్యాటరీని కలిగి ఉంటాయి. సైకిల్ లేదా మోటార్ సైకిల్ టైర్లే కాకుండా ఫుట్‌బాల్ వంటి వాటిలో కూడా దీని ద్వారా గాలి నింపవచ్చు.

ఖరీదు తక్కువే..

టైర్ ఇన్‌ఫ్లేటర్లు ధర పరంగా చాలా పొదుపుగా ఉంటాయి. మీరు వీటిని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. మెరుగైన నాణ్యత, ఎక్కువ కాలం వినియోగాన్ని పొందడానికి కొంచెం ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం మంచిది. వాటి ధర రూ.2000 నుంచి రూ.5000 వరకు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories