Skoda: త్వరపడండి.. ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదు.. 5స్టార్ సేఫ్టీ రేటింగ్ కారుపై రూ.2.50 లక్షల తగ్గింపు

Skoda: త్వరపడండి.. ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదు.. 5స్టార్ సేఫ్టీ రేటింగ్ కారుపై రూ.2.50 లక్షల తగ్గింపు
x
Highlights

Skoda: మరికొద్ది రోజుల్లో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త.. ప్రముఖ కార్ల తయారీదారు స్కోడా నవంబర్, 2024లో సెడాన్...

Skoda: మరికొద్ది రోజుల్లో కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త.. ప్రముఖ కార్ల తయారీదారు స్కోడా నవంబర్, 2024లో సెడాన్ స్లావియాపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. గాడివాడి వెబ్ సైట్లో ప్రచురించిన ఒక వార్త ప్రకారం.. స్టాండర్డ్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన పాత మోడల్ స్కోడా స్లావియాపై కంపెనీ గరిష్టంగా రూ. 2.50 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది.

ఇదే కాకుండా, స్టాండర్డ్ 6-ఎయిర్‌బ్యాగ్ స్కోడా స్లావియాపై కంపెనీ రూ. 1 లక్ష వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ కూడా ఉన్నాయి. కస్టమర్స్ తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదిస్తే డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఈ కారు పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడినట్లయితే, స్కోడా స్లావియాలో 1.0-లీటర్ టీఎస్ఐ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 115bhp శక్తిని , 178Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కస్టమర్లకు కారులో 1.5-లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆఫ్షన్ కూడా ఉంది. ఇది గరిష్టంగా 150bhp శక్తిని , 250Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కారు ఇంజన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ టెక్నాలజీతో ఆపరేట్ చేయవచ్చు. స్కోడా స్లావియాలో లీటరుకు గరిష్టంగా 19.47 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

మరోవైపు, కారు లోపలి భాగంలో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం కారులో 6-ఎయిర్‌బ్యాగ్స్, EBDతో కూడిన ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్, వెనుక పార్కింగ్ సెన్సార్ కూడా ఉన్నాయి.

స్కోడా స్లావియా మార్కెట్‌లో మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నాలతో పోటీపడుతోంది. గ్లోబల్ NCAP నుండి కుటుంబ భద్రత కోసం క్రాష్ టెస్ట్‌లో స్కోడా స్లావియా 5-స్టార్ రేటింగ్‌కు లభించింది. స్కోడా స్లావియా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 10.69 లక్షల నుండి రూ. 18.69 లక్షల వరకు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories