Skoda Kylaq Bookings: స్కోడా కైలాక్ కారు వచ్చేసింది... టెంప్ట్ చేస్తోన్న ఫీచర్స్, ధరలు, ఆఫర్స్

Skoda Kylaq Bookings: స్కోడా కైలాక్ కారు వచ్చేసింది... టెంప్ట్ చేస్తోన్న ఫీచర్స్, ధరలు, ఆఫర్స్
x
Highlights

Skoda Kylaq car prices, introductory offers, features: స్కోడా బ్రాండ్ కస్టమర్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తోన్న స్కోడా కైలాక్ కార్ వచ్చేసింది. స్కోడా...

Skoda Kylaq car prices, introductory offers, features: స్కోడా బ్రాండ్ కస్టమర్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తోన్న స్కోడా కైలాక్ కార్ వచ్చేసింది. స్కోడా కైలాక్ కారు బుకింగ్స్ ఇవాళ్టి నుండే అందుబాటులోకి వచ్చాయి. స్కోడా ఆటో ఇండియా అధికారిక వెబ్ సైట్ లో లేదా స్కోడా డీలర్స్ వద్ద ఈ కారును బుక్ చేసుకోవచ్చు. 2025 జనవరి 27 నుండి స్కోడా కైలాక్ కార్ల డెలివరీ ప్రారంభమవుతుంది. ఈ కారును కొనే మొట్టమొదటి 33,333 మంది కస్టమర్లకు మూడేళ్ల పాటు స్టాండర్డ్ మెయింటెనెన్స్ ప్యాకేజ్‌ను కాంప్లిమెంటరీ కింద ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్లు స్కోడా ఆటో ఇండియా ప్రకటించింది.

స్కోడా కైలాక్‌లో ఏయే వేరియెంట్ కారు ఎంత ధర ఉందంటే..

క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్.. ఇలా మొత్తం నాలుగు వేరియెంట్స్‌లో ఈ స్కోడా కైలాక్ కారు లభించనుంది.

స్కోడా కైలాక్ క్లాసిక్ వేరియెంట్ కారు ఎక్స్ షోరూం ధర రూ. 7.89 లక్షలుగా ఉంది

స్కోడా కైలాక్ సిగ్నేచర్ మ్యాన్వల్ ట్రాన్స్‌మిషన్ వేరియెంట్ కారు ఎక్స్ షోరూం ధర రూ. 9.59 లక్షలుగా ఉంది. ఇదే వేరియంట్‌లో ఆటో ట్రాన్స్ మిషన్ మోడల్ కారు ఎక్స్ షోరూం ధర రూ.10.59 లక్షలుగా నిర్ణయించారు.

సిగ్నేచర్ ప్లస్ ఎంటీ వేరియెంట్ కారు ఎక్స్ షోరూం ధర రూ. 11.40 లక్షలుగా ఉంది. ఇదే వేరియంట్‌లో ఆటో ట్రాన్స్ మిషన్ మోడల్ కారు ఎక్స్ షోరూం ధర రూ.12.40 లక్షలుగా నిర్ణయించారు.

స్కోడా కైలాక్ ప్రెస్టీజ్ ఎంటీ వేరియెంట్ కారు ఎక్స్ షోరూం ధర రూ. 13.35 లక్షలు. స్కోడా ప్రెస్టీజ్ ఆటో ట్రాన్స్ మిషన్ మోడల్ కారు ఎక్స్ షోరూం ధర రూ.14.40 లక్షలుగా ఉంది.

ఇప్పటికే సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లలో హ్యూందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా కార్లు ఉన్నాయి. ఇప్పుడు అదే సెగ్మెంట్ లోకి స్కోడా కైలాక్ కారు కూడా ఎంట్రీ ఇస్తోంది.

స్కోడా కైలాక్ ఫీచర్స్, హైలైట్స్ ఏంటంటే..

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ కోసమే స్కోడా డిజైన్ చేసిన MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై స్కోడా కైలాక్ కారును రూపొందించారు.

సబ్ కాంపాక్ట్ వాహనమే అయినప్పటికీ... పొడవులో 3,995 mm, 1,975 mm వెడల్పు, 1,575 mm ఎత్తుతో ఇంటీరియర్ స్పేస్ వచ్చేలా కారు డిజైన్ ఉంది. వీల్ బేస్ 2,566 mm, 189 mm గ్రౌండ్ క్లీయరెన్స్ తో కారుకు భారీ లుక్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అంటే తెగ ఇష్టపడే వారిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ స్కోడా కైలాక్ కారు ఇంటీరియర్స్ డిజైన్ చేశారు. అందులో చెప్పుకోదగినవి ఏంటంటే..

  1. డ్రైవింగ్ సీటులో ఉండే వారి సౌలభ్యం కోసం 8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు.
  2. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు కనెక్ట్ అయ్యేలా 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్
  3. కెనెక్టెడ్ కార్ టెక్నాలజీ
  4. సింగిల్ పేన్ సన్‌రూఫ్
  5. యాంబియెంట్ లైటింగ్
  6. ఆరు స్పీకర్స్‌తో సౌండ్ సిస్టం

స్కోడా కైలాక్ సేఫ్టీ ఫీచర్స్

  1. సిక్స్ ఎయిర్ బ్యాగ్స్
  2. ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టంతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం (ABS with EBD)
  3. కారులో కార్చునే ప్రయాణికులు అందరికీ త్రీ పాయింట్ సీల్ బెల్ట్స్ సౌకర్యం
  4. సెన్సార్స్‌తో రివర్స్ పార్కింగ్ కెమెరా
Show Full Article
Print Article
Next Story
More Stories