Skoda Kylaq: మరో రెండ్రోజుల్లో బుకింగ్ ప్రారంభం.. కేవలం రూ. 7.89 లక్షలకు స్కోడా కారు..!

Skoda Kylaq Bookings Open In 2 Days Along With Full Price Reveal
x

Skoda Kylaq: మరో రెండ్రోజుల్లో బుకింగ్ ప్రారంభం.. కేవలం రూ. 7.89 లక్షలకు స్కోడా కారు..!

Highlights

స్కోడా కైలాక్ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో కుషాక్ క్రింద ఉంటుంది. ఇది క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ వంటి నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

Skoda Kylaq: స్కోడా ఇండియా తన కొత్త చౌకైన కైలాక్ కారును ఈ నెల ప్రారంభంలో విడుదల చేసింది. సబ్ 4-మీటర్ ఎస్ యూవీ సెగ్మెంట్‌లో ఇది అత్యంత చౌకైన కారు. కంపెనీ తన అధికారిక బుకింగ్‌ను డిసెంబర్ 2 నుండి ప్రారంభించబోతోంది. అదే రోజున, కంపెనీ తన అన్ని వేరియంట్‌ల ధరలను కూడా వెల్లడిస్తుంది. దీని డెలివరీ జనవరి 27, 2025 నుండి ప్రారంభమవుతుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.89 లక్షలతో ప్రారంభించబడింది. భారతీయ మార్కెట్లో, ఇది మారుతి బ్రెజ్జా, మారుతి ఫ్రాంటెక్స్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా CUV 3XO, నిస్సాన్ మాగ్నైట్ వంటి అనేక మోడళ్లతో పోటీపడుతుంది.

స్కోడా కైలాక్ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో కుషాక్ క్రింద ఉంటుంది. ఇది క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్టీజ్ వంటి నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. దీని పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,975 మిమీ, ఎత్తు 1,575 మిమీ. దీని వీల్ బేస్ 2,566 మిమీ. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 189 మిమీ. ఇది 446 లీటర్ల క్లాస్-లీడింగ్ బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. వెనుక సీట్లను మడతపెట్టడం ద్వారా బూట్ స్పేస్ 1,265 లీటర్లకు పెంచుకోవచ్చు. ప్రస్తుతం, కైలాక్‌లో సింగిల్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ దీనికి 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అందించింది, ఇది 115hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఎంపిక దాని మిడ్-స్పెక్ సిగ్నేచర్‌లో అందుబాటులో ఉండదు. ఇది 6-స్పీడ్ మాన్యువల్‌ని పొందుతుంది. కైలాగ్ కేవలం 10.5 సెకన్లలో 0 నుండి 100kph వరకు వేగాన్ని అందుకుంటుందని స్కోడా కంపెనీ పేర్కొంది.

స్ప్లిట్ సెటప్‌లో బోల్డ్ రేడియేటర్ గ్రిల్, కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో స్కోడా కలోస్ బ్రాండ్ సిగ్నేచర్ డిజైన్‌లో రానుంది. హెడ్‌లైట్‌ల పైన ఎల్ ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLలు) ఉన్నాయి. ఇది క్లాడింగ్‌తో కూడిన డ్యూయల్-టోన్ బంపర్, షార్ఫ్ బానెట్‌తో సరికొత్తగా కనిపిస్తుంది. ఇవన్నీకారుకు న్యూ లుక్ అందిస్తాయి. 17-అంగుళాల రిమ్స్, బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్, స్క్వేర్ వీల్ ఆర్చ్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్న రూఫ్ రెయిల్‌లు ఆకట్టుకుంటాయి. వెనుక భాగంలో LED ఇన్సర్ట్‌లతో కూడిన పెంటగాన్-ఆకారపు టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

స్కోడా కైలాక్ మొత్తం పొడవు 3,995 మిమీ. ఈ సబ్-కాంపాక్ట్ ఎస్ యూవీ 189ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఈబీడీతో కూడిన ABS, Isofix చైల్డ్ సీట్ మౌంట్‌లు, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ వంటి ఫీచర్లు కస్టమర్‌లను ఆకట్టుకున్నాయి. కైలాక్ లో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. సింగిల్-పేన్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెథెరెట్ అప్హోల్స్టరీ, కీలెస్ ఎంట్రీ, డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ రెండింటికీ పవర్డ్ సీట్ అడ్జస్ట్‌మెంట్ వంటి ఎంపికలు కూడా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories