Skoda Kushaq Onyx: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. పవర్ ఫుల్ ఫీచర్లు.. స్కోడా నుంచి కొత్త ఆటోమేటిక్ ఎస్‌యూవీ.. ధర ఎంతంటే?

skoda kushaq onyx automatic suv launched in india check price and features
x

Skoda Kushaq Onyx: సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. పవర్ ఫుల్ ఫీచర్లు.. స్కోడా నుంచి కొత్త ఆటోమేటిక్ ఎస్‌యూవీ.. ధర ఎంతంటే?

Highlights

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో కుషాక్ కొత్త ఒనిక్స్ ఎడిషన్‌ను విడుదల చేయడంతో స్కోడా ఆటో భారత మార్కెట్లో తన వాహన పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేసింది.

Skoda Kushaq Onyx: స్కోడా కుషాక్ ఒనిక్స్ ప్రాథమికంగా యాక్టివ్, యాంబిషన్ వేరియంట్‌ల మధ్య ఉంచారు. హై ఎండ్ వేరియంట్లలోని కొన్ని ఫీచర్లు కూడా ఇందులో పొందుపరిచారు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దలు, పిల్లల భద్రతా పరీక్షలలో 5-స్టార్ రేటింగ్ పొందిన దేశంలో మొదటి SUVగా నిలిచింది.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో కుషాక్ కొత్త ఒనిక్స్ ఎడిషన్‌ను విడుదల చేయడంతో స్కోడా ఆటో భారత మార్కెట్లో తన వాహన పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త వేరియంట్ ప్రారంభ ధర రూ. 13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా పేర్కొంది. అధునాతన క్యాబిన్ ఫీచర్లు, అద్భుతమైన భద్రతతో కూడిన ఈ SUV స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.

సేఫ్టీ..

పెద్దలు, పిల్లల భద్రతలో పూర్తి 5-స్టార్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్‌ను పొందిన దేశంలో మొదటి SUVగా స్కోడా కుషాక్ నిలిచింది. ఈ SUV క్రాష్ టెస్ట్ 2022 సంవత్సరంలో జరిగింది. పెద్దల భద్రతలో 34 పాయింట్లకుగాను 29.64 పాయింట్లు, పిల్లల భద్రతలో 49 పాయింట్లకు 42 పాయింట్లు సాధించింది. భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఎస్‌యూవీని ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

ఒనిక్స్ వేరియంట్‌లో ప్రత్యేకత ఏంటంటే..

కుషాక్ ఒనిక్స్ వేరియంట్ ఈ SUV యాక్టివ్, యాంబిషన్ వేరియంట్‌ల మధ్య ఉంచారు. అధిక వేరియంట్లలోని కొన్ని ఫీచర్లు కూడా ఇందులో పొందుపరిచారు. ఉదాహరణకు, దీనికి స్కోడా క్రిస్టలైన్ LED హెడ్‌ల్యాంప్ ఇచ్చారు. ఇది స్టాటిక్ కార్నరింగ్ ఫంక్షన్‌తో వస్తుంది. వెనుకవైపు వైపర్, డీఫాగర్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా, 'టెక్టన్' వీల్ కవర్ కూడా అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories