Driving Tips: వర్షంలో కారు నడిపిస్తున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..!

Should Follow These Driving Tips in Rainy Season
x

Driving Tips: వర్షంలో కారు నడిపిస్తున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..!

Highlights

Driving Tips: ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్‌ అయ్యాయి.

Driving Tips: ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్‌ అయ్యాయి. దీంతో అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక వర్షం పడుతున్న సమయంలో ప్రయాణం చాలా ఇబ్బందితో కూడుకున్న విషయమని తెలిసిందే. అలాగే వర్షాల కారణంగా రోడ్లన్నీ పచ్చిగా మారిపోతుంటాయి. దీంతో వాహనాలు స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా కారు డ్రైవింగ్ చేసే వారు వర్సాకాలంలో కొన్ని రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వర్షంలో కారు బయటకు తీసే ముందు గుర్తు పెట్టుకోవాల్సిన ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వర్షాకాలంలో సాయంత్రం త్వరగా చీకటి అవుతుంది. అందులోనూ వర్షం పడుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగ్గా కనిపించవు. కాబట్టి కారు బయటకు తీసేముందు కచ్చితంగా ఓసారి లైట్స్‌ను పరిశీలించాలి. హెడ్‌లైట్స్‌తో పాటు టెయిలైట్స్‌ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి. అంతేకాకుండా ఎదురుగా వస్తున్న వాహనాలకు సిగ్నల్‌ ఇవ్వడానికి కూడా ఈ లైట్స్‌ ఉపయోగపడుతాయి.

* ఇక వర్షాకాలంలో కార్లపై దుమ్ము, ధూళి పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది కారు డ్యామేజ్‌ కావడానికి కూడా కారణమవుతుంది. ఇక వర్షాకాలంలో చెట్లు విరిగిపడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పరిస్థితుల్లో చెట్ల కింద కారు ఉండకుండా చూసుకోవాలి. వర్షం పడకుండా ఉంటుందని కొందరు చెట్ల కింద పెడుతుంటారు. అయితే దానికి బదులుగా కారుకు కవర్‌ ఉపయోగించడం మంచిది.

* వర్షాకాలంలో ప్రధానంగా చూసుకోవాల్సి మరో అంశం కారు వైపర్స్‌ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో. నిత్యం జల్లులు కురుస్తూనే ఉండే ఇలాంటి సమయంలో కచ్చితంగా వైపర్ వర్కింగ్ కండిషన్‌లో ఉండేలా చూసుకోవాలి. కారు బయటకు తీసే సమయంలోనే ఓసారి వైపర్‌ పనిచేస్తుందో లేదో చూడాలి.

* కొన్ని సందర్భాల్లో వర్షాకాలంలో బ్రేక్‌లు సరిగ్గా పనిచేయవు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోడ్లు పచ్చిగా ఉండడం వల్ల కారు కూడా స్కిడ్ అవుతుంటుంది. కాబట్టి వర్షంలో ఎప్పుడు కారు బయటకు తీసినా కారు బ్రేకింగ్ సిస్టమ్‌ను తనిఖీ చేసుకోవడం మంచిది.

* వర్షానికి రోడ్లు పచ్చిగా మారడంతో కారు స్కిడ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా టైర్లు అరగడం వల్ల జరుగుతుంది. కాబట్టి టైర్లను నాణ్యతను ఒకసారి చెక్‌ చేయించుకోవాలి. అవసరమైతే టైర్లు మార్చుకోవడం ఉత్తమం. ఇక వీల్‌ అలైన్‌మెంట్ కూడా సరిగ్గా ఉందో లేదో ఓసారి చెక్‌ చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories