Royal Enfield Electric Bike: వచ్చేస్తుంది రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌.. ఎప్పుడు లాంచ్‌ చేస్తారంటే..?

Royal Enfield to Enter the Electric Two-Wheeler Segment Know When the First Bike will be Launched
x

Royal Enfield Electric Bike: వచ్చేస్తుంది రాయల్‌ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌.. ఎప్పుడు లాంచ్‌ చేస్తారంటే..?

Highlights

Royal Enfield Electric Bike: త్వరలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రవేశించబోతుంది.

Royal Enfield Electric Bike: త్వరలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రవేశించబోతుంది. కంపెనీ సీఈవో సిద్ధార్థ్ లాల్ ప్రకారం.. ప్రస్తుతం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను తయారుచేసే దశలో నిమగ్నమై ఉన్నాం వచ్చే రెండేళ్లలో భారతీయ రోడ్లపైకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో తన లక్ష్యాలను సాధించడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉందన్నారు. 1.5 లక్షల ఎలక్ట్రిక్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు గత జూలైలో 32 శాతం పెరిగాయి. మొత్తం 73117 యూనిట్లను విక్రయించింది. ఇందులో దేశీయ, ఎగుమతి రెండు అమ్మకాలు ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కంపెనీ 42 శాతం వృద్ధితో 66062 యూనిట్లను విక్రయించింది. హంటర్ 350 బైక్‌కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విడుదలైన ఒక సంవత్సరంలోనే రెండు లక్షల యూనిట్లను దాటినట్లు కంపెనీ వెల్లడించింది. హంటర్ 350 మోడల్‌ను ఆగస్టు 2022లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

హంటర్ 350 మోడల్ ఫిబ్రవరి 2023లో లక్ష యూనిట్ల విక్రయాల మార్కును తాకింది. తర్వాత కేవలం ఐదు నెలల్లోనే తదుపరి లక్ష యూనిట్ల విక్రయాలను సాధించింది. అయితే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ టూవీలర్‌ సెగ్మెంట్‌లోకి వస్తే మిగతా కంపెనీల వాహనాల అమ్మకాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే అది వారు తయారుచేసే ఎలక్ట్రిక్‌ బైక్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుందని వాహనదారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories