బైక్ నడుపుతూ వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతున్నారా.. తాట తీసేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. ఎక్కడంటే?

Road Safety  Talking to Pillion Rider While Bike Driving is Punishable in Kerala
x

బైక్ నడుపుతూ వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతున్నారా.. తాట తీసేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. ఎక్కడంటే?

Highlights

Bike Safety: రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో, మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్ (MVD) బైక్ రైడర్‌లను లక్ష్యంగా చేసుకుని కొత్త నియమాలను ప్రవేశపెడుతుంటారు.

Bike Safety: రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో, మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్ (MVD) బైక్ రైడర్‌లను లక్ష్యంగా చేసుకుని కొత్త నియమాలను ప్రవేశపెడుతుంటారు. ఇలాంటి రూల్స్ రైడర్లకు సేఫ్టీతోపాటు, రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణను అందిస్తుంటాయి. ఈ క్రమంలో కేరళలో కొత్త రూల్ ప్రవేశ పెట్టారు. ఈ కొత్త రూల్ ప్రకారం ప్రకారం సీటుపై కూర్చున్న రైడర్‌తో మాట్లాడటం ఇప్పుడు శిక్షార్హమైనదిగా చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ సూచనను ఉల్లంఘించినందుకు నిర్దిష్ట శిక్షను మాత్రం వెల్లడించలేదు. అయితే, దీని లక్ష్యం బైక్ రైడర్ దృష్టిని మరల్చకూడదని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమేనని స్పష్టంగా తెలిపారు.

సూచనలు..

సూచనల ప్రకారం, రైడర్‌లు పిలియన్ రైడర్‌తో మాట్లాడుతున్నప్పుడు దృష్టిని కోల్పోవచ్చు. దీంతో మెయిన్ రైడర్ నిర్ణయం తీసుకోవడాన్ని దెబ్బతీస్తుంది. ప్రతిస్పందన సమయాన్ని ఆలస్యం చేస్తుంది. ఈ పరధ్యానం క్లిష్టమైన రహదారి పరిస్థితులు, ట్రాఫిక్ దృశ్యాల నుంచి దృష్టిని మళ్లిస్తుంది. ప్రమాదాల సంభావ్యతను పెంచుతుందని అంటున్నారు.

ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు మీ వెనుక కూర్చున్న వ్యక్తితో మాట్లాడటం ప్రమాదకరం. ఇది రైడర్ దృష్టిని రహదారి నుంచి మళ్లిస్తుంది, ప్రతిచర్య సమయం, పరిస్థితుల అవగాహనను తగ్గిస్తుంది. ఈ పరధ్యానం కారణంగా, రైడర్ ముఖ్యమైన ట్రాఫిక్ సిగ్నల్‌లు, పాదచారులు లేదా అడ్డంకులను కోల్పోవచ్చు. ప్రమాదం జరిగే అవకాశాలను పెంచుతాయి. అదనంగా, మాట్లాడడం వల్ల తరచుగా తలను తిప్పడం లేదా స్థానాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బైక్‌ను మరింత అస్థిరపరుస్తుంది. రైడర్ నియంత్రణను తగ్గిస్తుంది. ముఖ్యంగా అధిక వేగంతో లేదా ట్రాఫిక్‌లో ఇబ్బందులకు గురి చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories