Quantum Energy: మనల్నెవడ్రా ఆపేది.. క్వాంటం ఎనర్జీ ఊరమాస్ సేల్స్.. ఎందుకో తెలుసా..?

Quantum Energy
x

Quantum Energy

Highlights

Quantum Energy has crossed the 10000 electric two wheeler sales mark This record was surpassed in just 2 years

Quantum Energy: భారతీయ ఆటోమార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాA అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. ఇటీవలే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ క్వాంటమ్ ఎనర్జీ 10 వేల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సేల్స్ మార్క్‌ను క్రాస్ చేసింది. ఇది కంపెనీ భారీ విజయంగా చెప్పవచ్చు. కంపెనీ ఈ రికార్డును కేవలం 2 సంవత్సరాలలో అధిగమించింది. దీనిలో అనేక వేరియంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో పూర్తి వివరాలను తెలుసుకుందాం.

క్వాంటం ఎనర్జీ అక్టోబర్ 2022లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ల కారణంగా కంపెనీ కేవలం రెండేళ్లలో 10 వేలకు పైగా విక్రయాల మార్కును దాటింది. క్వాంటమ్ ఎనర్జీ ఇప్పుడు అమ్మకాల పరంగా టాప్-10 ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలలో ఒకటిగా ఉంది. క్వాంటం ఎనర్జీ లైనప్‌లో అనేక స్కూటర్లు ఉన్నాయి. కంపెనీ లాంగ్ రేంజ్ EVలను కలిగి ఉంది. ముఖ్యంగా 1500W పీక్ మోటార్‌తో కూడిన ప్లాస్మా మోడల్‌లు మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి.

ఇది కాకుండా ప్లాస్మా XR ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఇది కాకుండా, కంపెనీ లైనప్‌లో 1000W మోటార్‌తో కూడిన మిలన్ మోడల్ కూడా ఉంది. అలానే వాణిజ్య అవసరాలను తీర్చడానికి కంపెనీ ప్రత్యేక Bziness స్కూటర్‌ను కూడా అందిస్తుంది. ఈ మోడల్ 1200W మోటార్‌తో అమర్చబడింది. ప్రస్తుతం 11 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో బలమైన ఉనికిని కలిగి ఉన్న క్వాంటం ఎనర్జీ దేశవ్యాప్తంగా 108 టచ్‌పాయింట్‌ల స్ట్రాంగ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

మొత్తంమీద, ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలో క్వాంటం ఎనర్జీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. క్వాంటమ్ ఎనర్జీ ప్లాస్మా X, ప్లాస్మా XR ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండూ భారతీయ మార్కెట్లో ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ప్లాస్మా X ఎలక్ట్రిక్ స్కూటర్ శక్తివంతమైన 1500W మోటార్‌తో వస్తుంది. ఇది 60V 50Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 65 కి.మీ. ప్లాస్మా X కేవలం 7.5 సెకన్లలో సున్నా నుండి 40 kmph వరకు వేగవంతం చేయగలదు. ఇందులో కీలెస్ స్టార్ట్, రివర్స్ గేర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇది కాకుండా రెండు డ్రైవ్ మోడ్‌లు (ఎకో మరియు స్పోర్ట్స్) అందుబాటులో ఉన్నాయి. ప్లాస్మా XR ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1500W మోటార్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కి.మీ వరకు నడుస్తుంది. ఈ స్కూటర్ అర్బన్ రైడింగ్ కు అనువుగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories