Ola Electric: 'ఓలా ఎలక్ట్రిక్' కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 4 వేల రిటైల్‌ స్టోర్లు..!

Ola Electric Plans 4000 Stores in India To EV Distribution Network
x

Ola Electric: 'ఓలా ఎలక్ట్రిక్' కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 4 వేల రిటైల్‌ స్టోర్లు..!

Highlights

Ola Electric: దేశీయ ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్‌' తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది.

Ola Electric: దేశీయ ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్‌' తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా తమ రిటైల్ స్టోర్లను భారీ సంఖ్యలో పెంచాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 20 నాటికి 4,000 రిటైల్‌ స్టోర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 800 రిటైల్‌ స్టోర్లను 4 వేలకు పంచుతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈమేరకు ఆయన ఎక్స్‌ వేదికగా సోమవారం ఓ ప్రకటన చేశారు. 3,200 కొత్త స్టోర్లను తెరవడానికి ఓలా ఎలక్ట్రిక్‌ సిద్ధమైంది. ఇది నాలుగు రెట్లు అధికం అన్నమాట.

'ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 800 ఓలా ఎలక్ట్రిక్‌ స్టోర్ల సంఖ్యను ఏకంగా 4 వేలకు పెంచాలని నిర్ణయించాం. మా కష్టమట్లకు మరింత చేరువకావడమే మా అంతిమ లక్ష్యం. డిసెంబర్‌ 20న దేశవ్యాప్తంగా అన్ని స్టోర్లను ఒకేసారి ప్రారంభిస్తాం. ఈ స్థాయిలో స్టోర్లను ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే అన్ని సిద్దమయ్యాయి. స్టోర్లలో ఓలా ఎలక్ట్రిక్‌ సర్వీసులూ అందుబాటులో ఉంటాయి' అని ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీశ్‌ పోస్ట్‌లో తెలిపారు. విషయం తెలిసిన ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో విద్యుత్‌ వాహన అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రిక్‌ అగ్ర స్థానంలో ఉంది. ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీలు హోండా, హీరో మోటోకార్ప్, టీవీఎస్.. లాంటివి ఓలాను అధిగమించలేకపోతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఫిర్యాదులు బాగా వచ్చాయి. ముఖ్యంగా విక్రయ అనంతర సేవల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హెల్ప్‌ లైన్‌కు 10 వేలకు పైనే ఫిర్యాదులు రావడంపై సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ విచారణకు ఆదేశించింది. దాంతో ఓలా ఎలక్ట్రిక్‌ దిద్దుబాటు చర్యలు దిగి.. నేడు కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన అనంతరం ఓలా షేర్లు పెరగడం విశేషం.

ఓలా ఎలక్ట్రిక్‌ ఇటీవల తన వాహన శ్రేణిని మరింత విస్తరించింది. గిగ్‌, ఎస్‌1 జడ్‌ శ్రేణిలో స్కూటర్లను లాంచ్‌ చేసింది. గిగ్‌ శ్రేణిలో ఓలా గిగ్‌, ఓలా గిగ్‌ ప్లస్ స్కూటర్లను రిలీజ్ చేసింది. వీటి ధరలు రూ.39,999, రూ.49,999గా ఉన్నాయి. ఎస్‌1 జడ్‌ స్కూటర్‌ ధర రూ.59,999గా.. ఎస్‌1 జడ్‌ ప్లస్ ధర రూ.64,999గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. గిగ్‌ స్కూటర్లు 2025 ఏప్రిల్‌ నుంచి, ఎస్‌1 జడ్‌ స్కూటర్ల డెలివరీ 2025 మే నుంచి ప్రారంభం కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories