Ola Electric Offers: ఓలా బోస్ ఆఫర్.. స్కూటర్లపై రూ.25 వేల డిస్కౌంట్..!

Ola Electric has Announced Bose Offers Now you can buy it with a Discount of Rs 25 Thousand
x

Ola Electric Offers: ఓలా బోస్ ఆఫర్.. స్కూటర్లపై రూ.25 వేల డిస్కౌంట్..!

Highlights

Ola Electric Offers: పండుగల సీజన్‌లో సేల్స్ పెంచుకొనేందుకు కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

Ola Electric Offers: పండుగల సీజన్‌లో సేల్స్ పెంచుకొనేందుకు కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన బోస్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌లో ఇప్పుడు కొత్త ఈవెంట్‌ను 'BOSS 72-Hours Rush'సేల్‌ని ప్రకటించింది. అక్టోబర్ 10 నుండి 12 వరకు ఈ ఆఫర్లు కస్టమర్లు అందుబాటులో ఉంటాయి. కంపెనీ ప్రకారం ఇది పెస్టివల్ సీజన్‌లో అతపెద్ద సేల్. ఇప్పుడు ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధర కేవలం రూ.49,999 మాత్రమే. అదనంగా S1 పోర్ట్‌ఫోలియోలో రూ. 25,000 వరకు అదనపు ప్రయోజనాలు కూడా ఆఫర్ చేస్తోంది.

ఫ్లాగ్‌షిప్ S1 ప్రోపై రూ. 25,000 వరకు తగ్గింపు, రూ. 5,000 ఫ్లాట్ ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.బోస్ 72 గంటల సేల్‌లో రూ. 7,000 విలువైన 8 సంవత్సరాల లేదా 80,000 కి.మీ బ్యాటరీ వారంటీ ఉచితం. ఫైనాన్స్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ EMIలపై రూ. 5,000 వరకు ఆఫర్ చేస్తుంది. రూ. 6,000 విలువైన MoveOS+ అప్‌గ్రేడ్, రూ. 7,000 విలువైన ఉచిత ఛార్జింగ్ క్రెడిట్ అందిస్తోంది.

Ola Electric అన్ని రకాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా 6 మోడళ్లతో పెద్ద S1 పోర్ట్‌ఫోలియోను అందిస్తుంది. ప్రీమియం ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ ధర వరుసగా రూ.1,34,999. రూ.1,07,499. ఇటీవలే Ola Electric #HyperService ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దాని సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 కేంద్రాలకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అదనంగా దేశవ్యాప్తంగా దానిసేల్స్, సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా, ఓలా ఎలక్ట్రిక్ తన నెట్‌వర్క్‌ను 2025 చివరి నాటికి 10,000కి విస్తరించాలని యోచిస్తోంది. 1 లక్ష మంది థర్డ్-పార్టీ మెకానిక్‌లను ఎలక్ట్రిక్ వాహనాలకు సిద్ధం చేసేందుకు శిక్షణ ఇవ్వాలని సంకల్పించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories