EV Offers: రూ.1కే ఎలక్ట్రిక్ స్కూటర్.. లిమిటెడ్ ఆఫర్.. సింగిల్ ఛార్జ్‌తో 129 కిమీ రేంజ్

EV Offers
x

EV Offers

Highlights

EV Offers: ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్లను రూ.1కే బుక్ చేసుకోవచ్చు. అలానే 31 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

EV Offers: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అధికమైంది. ప్రజలు ఎక్కువగా వీటిని ఉపయోగించేందుకు ఇంటరెస్ట్ చూపుతున్నారు. కంపెనీలు కూడా వినియోగదారులకు అట్రాక్ట్ చేసేందుకు రకరకాల ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకాయ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిపై రూ. 31,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. అలానే ప్రత్యేమైన ఆఫన్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా రూ.1కే బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అనేది ఫైనాన్స్ స్టాక్ ఉన్నంత వరకే ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ఫ్రీడమ్ మోడల్ ధర రూ.74,899. అయితే ఈ ధర మోటోఫాస్ట్ కోసం రూ.1.29 లక్షలకు చేరుకుంటుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. అదనంగా 6.99 శాతంతో కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. రూ.2,999 నుండి EMI లతో ఫైనాన్సింగ్ ఎంపికలను కూడా అందిస్తుంది.

ఈ ఆఫర్ల గురించి ఒకాయ ఈవీ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా మాట్లాడుతూ 'ఈ ఆఫర్‌లను పరిచయం చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇవి భారతదేశంలోని ప్రతి ఇంటికి ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడానికి మా విస్తృత మిషన్‌లో భాగంగా ఉన్నాయి. ధరలను తగ్గించి సులభమైన బుకింగ్ ఆప్షన్లు అందించడం ద్వారా, నాణ్యత లేదా ఖర్చుతో రాజీ పడకుండా స్థిరమైన ఎంపిక చేసుకునేందుకు వినియోగదారులను మేము శక్తివంతం చేస్తున్నాము' అని ఆయన అన్నారు.

ఒకాయ కంపెనీ ఫెరారీ డిస్‌రప్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఎటువంటి ఆఫర్ అందించలేదు .దీని ధర రూ.1.6 లక్షల ఎక్స్-షోరూమ్. ఈ బైక్ PMS మోటార్‌ను 6.37kW (8.54bhp)అవుట్‌పుట్‌తో 95km/h వేగాన్ని అందిస్తుంది. ఈ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇందులో ఎకో, సిటీ, స్పోర్ట్స్ మోడ్ ఉన్నాయి. దీనిలో 3.97 kWh బ్యాటరీ ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 129 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఈ ఆఫర్‌లతో పాటు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నుండి ఒకాయ ఎలక్ట్రిక్ వెహికల్స్ వివిధ ప్రదేశాలలో 600 EV ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఆర్డర్‌ను పొందింది. ఇది కంపెనీకి పెద్ద విజయం. దీని ద్వారా వాహనాల వృద్ధిని పెంచడం, స్థిరమైన రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories